లిప్‌లాక్ ఏమైంది త్రివిక్రమ్..??
on Apr 8, 2015
నో డౌట్... త్రివిక్రమ్ సినిమా అంటే కుటుంబం అంతా కలసి చూసేలా ఉంటుంది. త్రివిక్రమ్ బలమే అది. నువ్వే నువ్వే నుంచి.. నిన్నటి అత్తారింటికి దారేది వరకూ త్రివిక్రమ్‌కి విజయాల్ని అందించింది ఈ ఫార్ములానే. ఇప్పుడు సన్నాఫ్ సత్యమూర్తి కూడా ఓ ఫ్యామిలీ డ్రామానే. కాకపోతే ఇందులో లవ్ స్టోరీ(స్) మిక్స్ అయ్యాయి. యూత్ కి ఐకాన్ లాంటి బన్నీ ఉన్నాడు. ముగ్గురు హీరోయిన్లున్నారు. అందుకే సరదాగా లిప్‌లాక్ పెట్టించాలనిపించింది త్రివిక్రమ్‌కి. బన్నీ - ఆదాశర్మలమధ్య ఓ పెదవెంగిలి ముద్దు తెరకెక్కించాడట. అయితే... తనపై ఉన్న ఫ్యామిలీ ముద్ర ఎక్కడ చెడిపోతుందో అన్న ఉద్దేశంతో ఆ సీన్ లేకుండానే... సెన్సార్ చేయించేశాడు త్రివిక్రమ్. అంటే త్రివిక్రమ్ ఎంతో ముచ్చట పడి తీసిన ముద్దు సీన్ సినిమాలో లేదన్నమాట. మరి ఆ సీన్ ఎందుకు షూట్ చేశాడో ఏంటో..? కనీసం సినిమా విడుదలయ్యాక యూ ట్యూబ్‌లో అయినా విడుదల చేస్తే.. జనం చూసి తరిస్తారుగా..?!