ముగ్గురు ముద్దుగుమ్మలతో నితిన్ ఏం చేస్తున్నాడు ?
on Jul 26, 2016

సినిమాల్లో అంటే హీరోగారి పక్కన కనీసం ఇద్దరు హీరోయిన్లు లేనిదే అటు హీరోగారికి ఇటు ఆడియన్స్ కు మూడ్ రాదు సరే. కానీ.. బయట కూడా అంతేనా అనుకొనేలా చేస్తున్నాడు యువ కథానాయకుడు నితిన్. 'అ ఆ" సూపర్ సక్సెస్ తర్వాత ఇప్పటివరకూ తన తదుపరి చిత్రం ఏమిటనే విషయాన్ని ఇంకా ప్రకటించని నితిన్ ప్రస్తుతం "బెల్జియం"లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు అందాల భామలతో చెట్టాపెట్టాలేసుకొని తిరుగుతున్నాడు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్ మరియు రెజీనాలతోపాటు స్టార్ స్టైలిస్ట్ నీరజ కోన కూడా ఈ బృందంలో ఒకరు. విహార యాత్రే అయినప్పటికీ ఈ స్పెషల్ ట్రిప్ కి ఒక రీజన్ ఉందండోయ్.
అదేమిటంటే.. బెల్జియం లోని "టుమారో ల్యాండ్" అనే ప్లేస్ లో జరిగే ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్ కు వీళ్ళందరూ వెళ్లారన్నమాట. ఈ సేడన్ ట్రిప్ రేపాటితో ముగుస్తుంది. ఈనెల 28న ఈ క్రేజీ గ్యాంగ్ ఇండియా రిటర్న్ అవుతారు. ప్రస్తుతం వీరి విహారయాత్ర ఫోటోలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తున్నాయి!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



