నిన్ను కోరి ఫస్టాఫ్ రివ్యూ..!
on Jul 7, 2017
డబుల్ హ్యట్రిక్ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న నేచురల్ స్టార్ నానీ లేటేస్ట్ మూవీ నిన్నుకోరిపై అభిమానులతో పాటు టాలీవుడ్ ఫుల్‌గా ఫోకస్ చేసింది. జెంటిల్మెన్లో నానితో పోటీపడి నటించిన నివేధా థామస్‌తో పాటు సరైనోడులో స్టైలిష్ విలన్‌గా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన ఆది పినిశెట్టి కూడా ఉండటంతో నిన్నుకోరిపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ ఇవాళ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. అయితే ఒక రోజు ముందే అమెరికాలో సందడి చేసింది..నిన్నుకోరి.. చూసి అక్కడి నుంచి తమవారికి సినిమా సంగతులు షేర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాకు తెలిసిన సమాచారం మేరకు ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అట..నివేదా తన భర్త ఆది పినిశెట్టి, తన మాజీ ప్రియుడు నాని మధ్య నలిగిపోతుందట..వైజాగ్‌లో మొదలయ్యే ఈ స్టోరీ యూఎస్‌లో ఎండ్ అవుతుందట. ప్రేమకు అద్భుతమైన నిర్వచనాన్ని ఇచ్చాడట డైరెక్టర్ శివ నిర్వాణ..సినిమా పర్వాలేదని..కాస్త స్లోగా నడుస్తూ ఒక ఫీల్ గుడ్ అనుభూతిని ఇస్తుందని సోషల్ మీడియా టాక్..ఫుల్ రివ్యూ కోసం తెలుగువన్.కామ్‌ను ఫాలో అవ్వండి
Also Read