ENGLISH | TELUGU  

డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచిన ‘నిలవే’ మూవీ!

on Feb 17, 2026

 

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ హీరోయిన్ గా నటించగా,  హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు.  POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం కానుకగా  ఫిబ్రవరి 13న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా అందరి ఆదరణ అందుకుంది. ఈ సందర్భంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో  సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, గీత రచయిత చంద్రబోస్ వీడియో బైట్ ద్వారా స్పందిస్తూ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచిందని చెబుతూ టీమ్‌ను అభినందించారు.

 

ఈ సందర్భంగా నిర్వహించిన  సక్సెస్ మీట్ కు   ముఖ్య అతిథిగా హాజరైన దర్శకులు వి సముద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ వాలెంటైన్స్ డేకి  విడుదలైన ఆరేడు చిత్రాల్లో ‘నిలవే’ సక్సెస్‌ఫుల్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచింది. ఇందులోని హీరో హీరోయిన్ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారు. డైరెక్టర్ సాయి కే వెన్నం గారితోపాటు టీమ్ అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నా”అని అన్నారు.

 

మరో అతిథిగా హాజరైన  జెమిని సురేష్​ మాట్లాడుతూ..‘‘ చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూశాననే ఫీలింగ్ మనసుకు  కలిగింది. బాపు గారు గీసిన బొమ్మలా, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలా, నేటి జనరేషన్‌ ‘గీతాంజలి’లా ‘నిలవే’ చిత్రం నిలుస్తుంది. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన  రాజ్ అల్లాడ గారికి థ్యాంక్స్. డైరెక్టర్ సాయి  విజన్,  దిలీప్ విజువల్స్‌, కళ్యాణ్ మ్యూజిక్ అద్భుతంగా కుదిరాయి. మా కరీంనగర్ కుర్రాడు సౌమిత్ ఈ సినిమాతో హిట్ కొట్టాడు”అని అన్నారు.  

 

హీరో సౌమిత్ మాట్లాడుతూ ..‘‘కొత్త వాళ్లమైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మూడేళ్ల కష్టమే ఈ సినిమా. రాజమౌళి గారు కూడా ‘బాహుబలి’ని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. మా ‘నిలవే’ మాకు ‘బాహుబలి’ లాంటిది.  ఈ జర్నీలో మాకెన్ని ఇబ్బందులొచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లాం. ఇప్పుడు ఆడియెన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇస్తుంది.  జెన్యూన్‌ హిట్‌గా మా చిత్రం నిలిచింది. నాలుగు రోజులుగా ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, హౌస్‌ఫుల్ బోర్డ్స్‌ చూసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం ”అని అన్నారు.

 

హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ..‘‘అధితి పాత్రలో నన్ను నమ్మిన సాయి వెన్నం,  సౌమిత్‌కు థ్యాంక్స్. మొదటి చిత్రంతోనే సక్సెస్ ఇచ్చిన తెలుగు ఆడియెన్స్‌కు థ్యాంక్స్. ”అని చెప్పారు.

 

దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ..‘‘మమ్మల్ని బ్లెస్ చేసిన అందరికీ థ్యాంక్స్. మూడేళ్ల క్రితం మొదలైన ఈ జర్నీ ఇక్కడవరకు వచ్చింది. ఈ మూవీ మేకింగ్‌లో  చాలా విషయాలు నేర్చుకున్నా. మన ఇంటెన్షన్ ప్యూర్‌‌గా ఉంటే అన్నీ నెరవేరుతాయి అనేది ఈ చిత్రంతో తెలుసుకున్నాను. సినిమా ఎందుకు తీయాలనే కారణం తెలుసుకుంటే  అన్ని బాగుంటాయని కొత్తగా వచ్చే మేకర్స్‌కు చెప్పగలను. మా కారణం గట్టిగా ఉంది కాబట్టే ఇక్కడవరకు వచ్చాం. టీమ్ అందరి సపోర్ట్‌తోనే సక్సెస్‌ వచ్చింది”అని అన్నారు.  

 

నిర్మాత రాజ్ అల్లాడ భార్య మాధూరి మాట్లాడుతూ..‘‘మా సినిమాకు ప్రేక్షకుల నుంచి  మంచి ఆదరణ దక్కడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన వారంతా కొత్త వాళ్లు తీసినట్టు లేదని చెబుతున్నారు.  ముఖ్యంగా మ్యూజిక్‌ మా మూవీకి మరింత ప్లస్ అయ్యింది. అందరి మనసుకు హత్తుకునేలా మా చిత్రం ఉంటుంది”అని చెప్పారు.

 

మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ ..‘‘ఆడియెన్స్ ఇచ్చిన ఈ సక్సెస్ చాలా హ్యాపీగా ఉంది. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కినట్టుగా  అనిపించింది”అని అన్నారు.  

 

నిర్మాత రాజ్ అల్లాడ మాట్లాడుతూ,  మంచి స్పందన వచ్చింది. చక్కటి మ్యూజికల్ లవ్ స్టోరీ. కొత్తవారైనా అందరూ బాగా నటించారు. హీరో కమ్ దర్శకుడు కూడా పాత్రలో లీనమై మురిపించాడు. ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతితిక సిబ్బంది పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని అన్నారు.

 

ఇంకా ఈ కార్యక్రమంలో  ఆర్ ఎల్ ట్రావెల్స్ అధినేత అనురాధ, అనిల్  కడియాల, నటుడు రూపేష్ తదితరులు మాట్లాడుతూ.. తమ చిన్న చిత్రానికి పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు.  

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.