పవన్ హీరోయిన్ ని పడేసిన గుర్రం
on Nov 21, 2014
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'పులి' సినిమా హీరోయిన్ నికిషా పటేల్ ని గుర్రం కింద పడేసి౦దట. టాలీవుడ్ లో అవకాశాలు దక్కకపోవడంతో కన్నడ, తమిళ్ లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా ఓ కన్నడ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నికిషాకి ఓ చేదు అనుభవం ఎదురైంది. 'ఆలోనే' మూవీ కోసం గుర్రపు స్వారీ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ఆమె కింద పడిపోయిందట. దీంతో చిత్ర యూనిట్ సభ్యులు కూడా కంగారుపడ్డారట. అయితే తనకు దెబ్బలు కూడా బాగానే తగిలాయని నికిషా పటేల్ ట్విట్టర్ లో పేర్కొంది. ప్రస్తుతం తను రెస్ట్ తీసుకుంటోంది. కొంచెం కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొంటా అని పేర్కొంది నికిషా. ప్రస్తుత౦ నికిషా పటేల్ చేతిలో.. 'నరతన్', 'సిగండి' అనే మరో రెండు తమిళ్ సినిమాలు రెడీగా వున్నాయి.