వీరభద్ర చౌదరి కొత్త సినిమా
on Jul 6, 2011
వీరభద్ర చౌదరి కొత్త సినిమా త్వరలో ప్రారంభం కానుందట. వీరభద్ర చౌదరి అంటే అల్లరి నరేష్ హీరోగా ఆ మధ్య వచ్చిన సూపర్ కామెడీ హిట్ చిత్రం "ఆహ నా పెళ్ళంట" దర్శకుడు. గతంలో జంధ్యాలగారు దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం పేరు "ఆహ నా పెళ్ళంట". ఆ చిత్రం పేరు పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. కానీ ఈ "అహ నా పెళ్ళంట" పేరుని తమ చిత్రానికి పెట్టగానే సినీ పరిశ్రమ యావత్తూ ఒక్కసారిగా ఎవరా ఈ వీరభద్ర చౌదరి...అని చూసింది. అతనికి ఎంత ధైర్యం ఉంటే హాస్య బ్రహ్మ జంధ్యాల గారి సూపర్ హిట్ సినిమా పేరు తన చిత్రానికి పెట్టుకుంటాడని సినీ పరిశ్రమలో చాలా మంది అనుకున్నారు.
కానీ ఆ సినిమా విడుదలై మంచి హిట్టయ్యింది. దాంతో అతనికి అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అయినా వీరభద్ర చౌదరి తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల అతని రెండవ సినిమా ప్రకటించటానికి కాస్త ఆలస్యమయ్యింది. అయితే ప్రస్తుతం అతని కొత్త సినిమా ఒ.కె. అయ్యింది. నిర్మాత, హీరో, హీరోయిన్లు తదితర వివరాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు వీరభద్ర చౌదరి.