ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని రహస్యం!
on Aug 7, 2024
టాలీవుడ్ లో వివాదరహితుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కి పేరుంది. ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ, ఒదిగి ఉంటాడని.. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని.. ప్రభాస్ తో కలిసి పని చేసినవారు ఆయన గురించి చెబుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే "ప్రభాస్ ఆరడుగుల బంగారం" అనేది ఆయనను దగ్గర నుంచి చూసినవారు చెప్పేమాట.
ప్రభాస్ ది గొప్ప మనసు. సాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు. ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు, లేదా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ప్రభాస్ వెంటనే సాయం చేస్తారు. తాజాగా వయనాడ్ బాధితులకు రెండు కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అయితే ఆయన చేసిన సాయాలు బయటకు తెలిసేవి కొన్నే. ఎటువంటి ప్రచారం లేకుండా ప్రభాస్ ఎన్నో సహాయాలు చేస్తుంటారని సన్నిహితులు చెబుతుంటారు.
కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. ప్రభాస్ ఇదే ఫాలో అవుతున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న ఓ ప్రముఖ స్కూల్ లో చదివే దాదాపు వంద మంది పిల్లలకు ప్రతి సంవత్సవరం ప్రభాస్ ఫీజులు కడుతున్నారట. అంతేకాదు భీమవరంలో ఎందరో విద్యార్థులకు సైతం ఆర్ధిక సాయం అందిస్తున్నారట. ఇదే సాయం ఎవరైనా చేస్తే.. ఎంతో ప్రచారం జరిగి ఉండేది. కానీ ప్రభాస్ మాత్రం ఎటువంటి ప్రచారం లేకుండా.. ఎందరో పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ రహస్యం ఆయన సన్నిహితుల ద్వారా బయటకు వచ్చింది. దీంతో ప్రభాస్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. రియల్ హీరో అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. "మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ, మనిషి కనపడక్కర్లేదు" అనే మాట ప్రభాస్ కి సరిగ్గా సరిపోతుందని అభిమానులు అంటున్నారు. ఇలాంటి హీరోకి అభిమానులు అయినందుకు గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read