క్షమాపణలు కోరుతున్నాను దయచేసి ట్రోల్ చెయ్యకండి
on Aug 7, 2024
ప్రియా భవాని శంకర్(priya bhavani shankar)గత సంవత్సరం సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన కళ్యాణం కమనీయం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యింది. గోపి చంద్ భీమాలోను మెరిసింది. అంతకంటే ముందే తన సొంత భాష తమిళంలో పది సినిమాలకి పైనే చేసింది. చక్కని నటనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తనని క్షమించమని అడుగుతుంది.
ప్రియా భవాని శంకర్ లేటెస్ట్ గా కమల్ శంకర్ ల భారతీయుడు 2(bharateeyudu 2) లో చేసింది. సొసైటీ లో చైతన్యం తీసుకొచ్చే ఆర్తి అనే అమ్మాయి క్యారక్టర్ లో సిద్దార్ధ్ టీం లో ఒకదానిగా చేసింది. ఇక భారతీయుడు 2 ఘోర పరాజయంతో టీం అండ్ మేకర్స్ మీద భారీగానే ట్రోల్స్ జరిగాయి. జరుగుతున్నాయి కూడా.ప్రియా పై కూడా ఒక లేవల్లోనే ట్రోల్స్ జరిగాయి. పైగా అసలు ఆ క్యారక్టర్ ఎలా ఒప్పుకున్నావని కూడా చాలా మంది సోషల్ మీడియాలో నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై ప్రియా రీసెంట్ గా ఎమోషనల్ అయ్యింది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఏ నటి అయినా కూడా శంకర్(shankar)కమల్(kamal haasan)సర్ లాంటి గొప్ప వాళ్ళ సినిమాలో ఆఫర్ ని వదులుకోవాలని చూడదు కదా. అందుకే చేశాను.ఒక వేళ నా వల్ల డిజప్పాయింట్ అయిన నా అభిమానులకి, ప్రేక్షకులకి క్షమాపణలు చెప్తున్నాను అని తెలిపింది.అదే విధంగా ట్రోల్స్ చెయ్యకండని కూడా వేడుకుంది. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా నిలిచాయి.
Also Read