మార్చిలో మోతే.. ఇది కదా విజయ్ సినిమా అంటే...
on Aug 2, 2024
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'VD 12' అనేది వర్కింగ్ టైటిల్. ఇటీవల ఈ మూవీ సెట్స్ నుంచి లీక్ అయిన విజయ్ లుక్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. విజయ్ చాలా కొత్తగా కనిపించాడు. ఆ సమయంలో త్వరలోనే ఫస్ట్ లుక్ రివీల్ చేస్తామని ప్రకటించిన సితార.. తాజాగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది.
'VD 12' విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. 2025, మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. షార్ట్ హెయిర్, గుబురు గడ్డంతో ఉన్న విజయ్.. వర్షంలో తడుస్తూ గట్టిగా అరుస్తున్న పోస్టర్ అదిరిపోయింది.
'VD 12' చిత్రీకరణ ఇప్పటిదాకా 60 శాతం పూర్తయింది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ ఆగస్టులోనే ఆవిష్కరించనున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. రిలీజ్ డేట్ పోస్టరే ఈ రేంజ్ లో ఉంటే.. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ ఏ రేంజ్ లో ఉంటుందోనన్న ఆసక్తి కలుగుతోంది. ఆగస్టు 15న ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశముంది.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్స్ గా గిరీష్ గంగాధరన్, జోమోన్ టి జాన్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
Also Read