రామ్ పోతినేని ఫ్యాన్స్ ఆందోళన.. ముంబై నుంచి రాక తప్పలేదు
on Aug 1, 2024
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram potineni)కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమి తక్కువ సంఖ్యలో లేదు. 2006 లో వచ్చిన దేవదాస్ తో మొదలుకొని జగడం, రెడీ, మస్కా, కందిరీగ, పండగ చేస్కో, హరే రామ హరే కృష్ణ, మసాలా, గణేష్, నేను శైలజ, హైపర్ ,హలో గురు ప్రేమకోసమే, ఇస్మార్ట్ శంకర్, వారియర్, స్కంద లాంటి విభిన్న సినిమాలతో ఫ్యామిలీ, యూత్ అండ్ మాస్ ఆడియెన్స్ లో భారీ ఎత్తునే అభిమాన గణాన్ని సంపాదించాడు. ఇప్పుడు వాళ్లంతా ఒక విషయంలో ఆందోళన చెందుతున్నారు.
రామ్ అప్ కమింగ్ మూవీ డబుల్ ఇస్మార్ట్(double ismart)ఇండిపెండెన్స్ డే కానుకగా అగస్ట్ 15 న విడుదల అవుతుంది. పూరి జగన్నాధ్(puri jagannadh)దర్శకుడు.రామ్ కెరీర్ లోనే వన్ అఫ్ ది వెరీ వెరీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కి సీ క్వెల్ కావడంతో అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. టీజర్ తో పాటు ఇటీవల విడుదలైన మార్ ముంత చోర్ చింత సాంగ్ ఒక రేంజ్ లో హిట్ అవ్వడంతో, డబుల్ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో అడుగుపెడుతుందో అనే ఆసక్తితో కూడా ఉన్నారు. కానీ డబుల్ గురించి వస్తున్న కొన్ని వార్తలు వాళ్ళకి కంటి మీద కును కు లేకుండా చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో డబుల్ ఇస్మార్ట్ ని హనుమాన్(hanuman)ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి(niranjan reddy)యాభై ఆరు కోట్లకి కొనుగోలు చేసాడు. హిందీ రైట్స్ ని ఐదు కోట్లకి కొనుగోలు చేసాడు. ఇంత వరకు బాగానే ఉంది.
ఇప్పుడు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను రంగంలోకి దిగాడు. ఈయన గతంలో పూరి, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ ని నైజాం ఏరియా డిస్ట్రిబ్యూట్ చేసి భారీ నష్టాలని చవి చూసాడు.ఆ నష్టం తాలూకు పంచాయితీ ఇప్పటికి పూరి అండ్ శ్రీనుల మధ్య జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే డబుల్ ఇస్మార్ట్ నైజాం హక్కులని తనకి ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నాడు. ఈ విషయంలోనే రామ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సినిమాకి కొన్ని రోజులే టైం ఉండగా ఈ రగడ ఏంటని అంటున్నారు. ఇక ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టడానికి నిర్మాతలైన పూరి, ఛార్మి లు ముంబై నుంచి హైదరాబాద్ కి వస్తున్నారు.
Also Read