ఒకరికి ఒకరు కరెక్ట్ మొగుళ్ళు
on Jul 29, 2024
అనసూయ(anasuya bharadwaj)చిన్మయి(chinmayi)ఇద్దరు కూడా తమ తమ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ని పొందారు. ఒకరు నటిగా ఇంకొకరు గాయనిగా ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకున్నారు. అంతే స్థాయిలో సోషల్ మీడియా లో కూడా పాపులారిటీ ని దక్కించుకున్నారు. అంతే కాకుండా ఈ ఇద్దరు చేసే పోస్ట్ లకి, ఇచ్చే రిప్లైస్ కి మంచి గిరాకీ కూడా ఉంది. అలాంటిది ఒకరి ఒకరు తలపడితే ఇంకేమైనా ఉందా! సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది.ఇప్పుడు అదే జరుగుతుంది.
అనసూయ మీద గత మూడు నాలుగు రోజులుగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సింబా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ స్టార్ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda)ని ఉద్దేశించి అనసూయ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.లైమ్ లైట్ లో ఉన్నప్పుడు స్టేజ్ మ్యానర్ తో పాటు పద్ధతిగా ఉండాలంటూ ఒక ఉదాహరణగా చెప్పింది. దీంతో అనసూయ కి దేవరకొండ కి మధ్య ఉన్న పాత గొడవల దృష్ట్యా దేవరకొండ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.దీంతో నువ్వు పద్దతి గురించి మాట్లాడుతున్నావా అంటూ అనసూయ కి చెందిన ఓల్డ్ వీడియోలతో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ వీడియోస్ లో పిల్లల ప్రోగ్రాం ఒకటి. అందులో అనసూయ ఒక పిల్లాడితో ముద్దులు పెట్టించుకుంటుంది. లిప్స్ మీద కూడా ముద్దులు పెట్టించుకుంటుంది. ఇప్పుడు ఈ షో మీదనే చిన్మయి మండి పడుతుంది.వినోదం పేరిట పిల్లలతో దారుణమైన షోలు చేస్తున్నారు. అసలు పిల్లలను ఇలాంటి షోలకు ఎలా తీసుకువస్తారు. పైగా అలాంటివి చేస్తుంటే చప్పట్లు కొడుతూ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది కచ్చితంగా ఫన్ కిందకి రాదని, అబ్యూజ్ అవుతుందంటు చాలా ఘాటుగానే స్పందించింది. ఇక చిన్మయి రెస్పాన్స్ కి అనసూయ సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చి మరి రీసౌండ్ ని ఇచ్చింది.
ఎంటర్ టైన్మెంట్ ని ఎంటర్టైన్మెంట్ లాగానే చూడాలి. షోస్ ఉంది కూడా కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసమే.అయినా పిల్లలకు అలాంటి షోస్ ని చూపించమని ఎవరు చెప్పారు. అబ్యూజ్ అవుతుందనుకుంటే చూపించకండి. వాళ్లకి నచ్చే కార్టూన్ ఛానెల్స్‌ని మాత్రమే చూపించండంటు తన దైన స్టైల్లో ఆన్సర్ చేసింది.అదే విధంగా ఇంకో విషయం గురించి కూడా చెప్పి అందర్నీ షాక్ కి గురి చేసింది. అలాంటి షోస్ లో నవ్వకపోయినా ఎడిటర్లు తమకు నచ్చినట్టుగా ఎడిట్ చేస్తారని చెప్పింది. ఇపుడు ఈ ఇద్దరి పోటా పోటీ మాటలు నెట్టింట ఒక రేంజ్ లోనే షికార్లు చేస్తున్నాయి. ఇద్దరకీ
ఇద్దరే అసలు తగ్గరని కూడా అంటున్నారు.
Also Read