బిగ్గెస్ట్ మూవీ ఫెస్టివల్.. ఒకే నెలలో మూడు బ్లాక్ బస్టర్లు!
on Jul 21, 2024
కొద్దిరోజుల క్రితం తెలుగునాట రీ-రిలీజ్ ట్రెండ్ ఒక ఊపు ఊపింది. రీ రిలీజ్ లోనూ పలు సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించారు. దాంతో వరుసగా ఎన్నో సినిమాలను మళ్ళీ విడుదల చేశారు మేకర్స్. అలా మితిమీరిన రీ రిలీజ్ ల దెబ్బకి ప్రేక్షకులు ఆ వైపు చూడటం మానేశారు. అయితే ఇప్పుడు ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసేలా నెల రోజుల వ్యవధిలో మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి.
రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'విక్రమార్కుడు' (Vikramarkudu). రవితేజ డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీ 2006 లో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉండే ఈ పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ.. జూలై 27 మళ్ళీ థియేటర్లలో అడుగుపెడుతోంది.
మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మురారి' (2001). టాలీవుడ్ చరిత్రలో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ.. మహేష్ పుట్టినరోజు కానుకగా ఆగష్టు 9 రీ-రిలీజ్ అవుతోంది. (Murari)
టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ మూవీ అంటే అందరూ చెప్పే పేరు 'శివ' (Shiva). నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. 1989 లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. నాగార్జున పుట్టినరోజు కానుకగా ఆగష్టు 29న ఈ మూవీ మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది.
Also Read