‘డార్లింగ్’ మూవీ రివ్యూ
on Jul 19, 2024
సినిమా పేరు: డార్లింగ్
తారాగణం: ప్రియదర్శి,నభా నటేష్, సుహాస్, అనన్య నాగళ్ల, నీహారిక కొణిదెల, బ్రహ్మానందం, రఘుబాబు, మురళీధర్ గౌడ్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: నరేష్ రామదురై
ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్
రచన, దర్శకత్వం: అశ్విన్ రామ్
నిర్మాత: నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: జూలై 19, 2024
కథ
చిన్న వయసు నుంచే రాఘవ్ (ప్రియదర్శి) మంచి భార్యని పొందాలనే లక్ష్యంతో పెరుగుతాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సూసైడ్ చేసుకోబోతాడు. అదే టైం లో అక్కడికొచ్చిన ఆనంది (నభా నటేష్) మాటలు విని ఆ ప్రయత్నాన్ని మానుకుంటాడు. పైగా మొదటి చూపులోనే ఆనందితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటానని ఆమెకి చెప్తాడు. ఇక రాఘవ్, ఆనంది పెళ్లి చేసుకుంటారు. కానీ రాఘవ్ జీవితంలోకి, మాయ,ఝాన్సీ, పాప, శ్రీ శ్రీ, స్వామిజీ వచ్చి విసిగిస్తుంటారు. ఆనందిని తనని కలవనీయకుండా చేస్తుంటారు. అసలు రాఘవ్ మొదట ఎందుకు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు? ఈ కథ లోనే ఉన్న ఇంకో ముఖ్య పాత్ర ప్రియ ఎవరు? ఆమెకి ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? మాయ,ఝాన్సీ, పాప, శ్రీ శ్రీ, స్వామిజీ ని దాటుకొని ఆనంది రాఘవ్ ఒక్కటి అయ్యారా అనేదే ఈ కథ.
ఎనాలసిస్
డార్లింగ్ టైటిల్ కి సినిమా కథ కి ఎలాంటి సంబంధం లేదు. దర్శకుడి ఉద్దేశ్యం ప్రకారం సినిమా చివర్లో జస్టి ఫైడ్ అవుతుందని అనుకున్నాడేమో. కానీ కథ చుట్టూ అల్లుకున్న కధాంశాలు టైటిల్ కి తగ్గ రీతినే ఉండాలనే విషయాన్ని మర్చిపోయాడు. అసలు తెలుగు సినిమా పుట్టిన దగ్గరనుంచి సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి కథలు రాని శుక్రవారం లేదు. పైగా ఎంత కొత్తదనంతో తెరకెక్కించినా కూడా ప్రెజంట్ డే ప్రకారం కొత్త ధనం లేదని తిరస్కరిస్తున్న వేళ ఇలాంటి సినిమా తెరకెక్కించాలంటే ఎన్నో గట్స్ ఉండాలి. ఫస్ట్ విషయానికి వస్తే హీరో, హీరోయిన్ పరిచయం, పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత మెడికల్ గా సమస్య రావడం అనేది చక చకా చూపించారు. అసలు చిన్నప్పటినుంచి మంచి భార్య కోసం కలలు కనే రాఘవ బాగా చదివి పెద్ద ఉధ్యోగం సంపాదించాలి. కానీ మాములు ఉద్యోగం చెయ్యడం విచిత్రంగా అనిపిస్తుంది. అదే విధంగా హీరోయిన్ ఇన్స్పిరేషన్ మాటలు విని ఆత్మహత్య ప్రయత్నాన్ని మానుకున్న రాఘవ ఆ తర్వాత కూడా కన్ఫ్యూజ్ గా ఎందుకు ఉంటాడో అర్ధం కాదు. అసలు మూవీ ఇంట్రడక్షనే హీరోయిన్ సమస్య మీద ఎత్తుకొని ఆ తర్వాత హీరోకి పరిచయం చేసుంటే అయ్యో హీరో తన జోలికి వెళ్తున్నాడురా అని ప్రేక్షకుడు అనుకునే వాడు. ఆ తర్వాత ఆ ప్రాసెస్ లోనే కామెడీ సీన్స్ రాసుకుని ఉంటే సినిమా రేంజ్ పెరిగేది. ఇక సెకండ్ ఆఫ్ లో కూడా పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు. ఒక భయంకరమైన సమస్య ని డైలాగులతో పోగొట్టి కథ మొత్తాన్నే కామెడి చేసి పడేసారు. అలా కాకుండా హీరోయిన్ పాత్రలో ఉన్న వేరియేషన్స్ మొత్తానికి కామెడి వెర్షన్స్ రాసుకొని, హీరో వాళ్ల ప్రాబ్లమ్స్ ని పొగట్టాల్సింది. అలా కాకుండా సెకండ్ ఆఫ్ మొత్తాన్ని ఎలా తెరకెక్కించాలో తెలియక షో చేసి పడేసారు. ఉన్నంతలో కాస్త రఘుబాబు సన్నివేశం బాగుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
ప్రియదర్శి ఎప్పటి లాగానే తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో విషయం లేకపోయినా కూడా ప్రేక్షకులని చివరి వరకు ఒప్పిగ్గా కూర్చునేలా చేసాడు. కాకపోతే ఇలాంటివి ఆయనకు కొట్టిన పిండే కాబట్టి ప్రియదర్శి ని పాత్ర పరంగా గొప్పగా చేసాడని చెప్పుకోలేం. ఇక నభా నటేష్ గురించి చెప్పుకోవాలంటే రకరకాల వేరియేషన్స్ ని ప్రదర్శించే కేరక్టర్స్ లో పూర్తిగా మెప్పించలేక పోయింది. సాధారణంగా నటన పరంగా అలాంటి పాత్రల్లో జీవించాలి. కానీ కొన్ని చోట్ల అయితే నభా నటిస్తుందనే విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది. కొన్ని చోట్ల విసిగించింది కూడా. ఇక ప్రత్యేక పాత్రల్లో మెరిసిన నీహారిక, సుహాస్ లు కనపడేది కొంత సేపే అయినా కూడా మెప్పించారు. వకీల్ సాబ్ అనన్య కూడా తన పాత్ర మేరకు బాగానే చేసింది. సీనియర్ నటుడు రఘుబాబు కాసేపే కనపడిన తన నటన కి ఉన్న సత్తాని మరో సారి చాటి చెప్పాడు. ప్రియదర్శి తండ్రి గా చేసిన బలగం మురళి గౌడ్ మరోసారి తను ఎంత వాల్యుబుల్ ఆర్టిస్టో తెలియచేసాడు. ఇక దర్శకుడు విషయానికి వస్తే అతడు సినిమాలో మహేష్ బాబు ని ఉద్దేశించి తనికెళ్ళ భరణి ఒక మాట చెప్తాడు. ఎవడైనా కోపంగా కొడతాడు, బలంగా కొడతాడు. కానీ హీరో ఏంటి చాలా శ్రద్దగా కొట్టాడు అని. సేమ్ ఈ డైరెక్టర్ కూడా అంతే. చాలా శ్రద్దగా ప్లాప్ చేసాడు. సినిమాలోకి వెళ్లే కొద్దీ ఈ విషయం అర్ధం అవుతుంది.అసలు రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడు థియేటర్స్ లో కూర్చోవాలంటే బలమైన కధాంశం ఉండాలనే విషయాన్నీ మర్చిపోయాడు. కొన్నికొన్ని సన్నివేశాల్ని చూస్తుంటే నాకు సినిమా తెరకెక్కించడం ముఖ్యం. ఎవరు ఎలా పోతే నాకేంటని బావించాడేమో అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా బాగోలేదు. హనుమాన్ మేకర్స్ నిర్మించారంటే ఎవరు నమ్మరు. ఇక పాటలు గాని నేపధ్య సంగీతం గురించి చెప్పుకోవడానికి గాని ఏమి లేదు. ఫోటో గ్రఫీ దగ్గర్నుంచి మిగతా అన్ని శాఖల గురించి కూడా కూడా నథింగ్
ఫైనల్ గా చెప్పాలంటే కథ కోసం పాత్రలు పుట్టడం బదులుగా పాత్రల కోసం కథ పుట్టిన సినిమా ఈ నయా డార్లింగ్.
రేటింగ్ 2.25/5 అరుణాచలం
Also Read