'బాహుబలి 2' కంటే 'పుష్ప 2' నే ఎక్కువ..!
on Jul 18, 2024
'బాహుబలి' (Baahubali) తోనే రెండు పార్ట్ ల సినిమా ట్రెండ్ మొదలైంది. ప్రభాస్ (Prabhas) హీరోగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. అయితే ఇది వీఎఫ్ఎక్స్ తో ముడిపడి ఉన్న భారీ బడ్జెట్ మూవీ అయినప్పటికీ.. మొదటి భాగానికి, రెండో భాగానికి మరీ ఎక్కువగా గ్యాప్ లేదు. 'బాహుబలి-1' 2015 జూలైలో విడుదలైతే, 'బాహుబలి-2' 2017 ఏప్రిల్ లో విడుదలైంది. అంటే రెండు భాగాలకు మధ్య రెండేళ్లు కూడా గ్యాప్ లేదు. అయినప్పటికీ రాజమౌళి బాహుబలికి ఎక్కువ సమయం తీసుకున్నాడంటూ అప్పట్లో పలువురు అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు సుకుమార్ (Sukumar) దెబ్బకి తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. రాజమౌళి విలువ తెలిసొచ్చిందని అంటున్నారు.
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'పుష్ప-1' చిత్రం 2021 డిసెంబర్ లో విడుదలైంది. సెకండ్ పార్ట్ 'పుష్ప-2' (Pushpa 2) 2024 డిసెంబర్ లో విడుదల కానుంది. అంటే మొదటి భాగానికి, రెండో భాగానికి మధ్య గ్యాప్.. ఏకంగా మూడేళ్లు. పైగా 2024 డిసెంబర్ లో 'పుష్ప-2' విడుదలవుతుందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి పుష్ప అనేది బాహుబలి మాదిరిగా భారీ సెట్లు, వీఎఫ్ఎక్స్ తో ముడిపడిన సినిమా కాదు. పైగా ఈ ఐదారేళ్లలో టెక్నాలజీ కూడా ఎంతో పెరిగింది. అయినప్పటికీ 'బాహుబలి 2' కంటే 'పుష్ప 2' విడుదలకు ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటికే మూడేళ్లు గ్యాప్ ఉంది. ఇప్పుడేమో ఈ డిసెంబర్ లో కూడా రిలీజ్ అవుతుందో లేదో అనే డౌట్ స్టార్ట్ అయింది. దీంతో అసలు 'పుష్ప 2' ఇంత లేట్ ఎందుకు అవుతుంది? పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో షూట్ కి వెళ్ళలేదా? లేదా సరైన షూట్ ప్లాన్ లేదా? అసలేం జరుగుతోంది? చర్చ మొదలైంది. మరికొందరేమో.. అప్పట్లో 'బాహుబలి'కి రాజమౌళి చాలా సమయం తీసుకున్నాడు అనుకున్నాం కానీ.. ఇప్పుడు 'పుష్ప'కి సుకుమార్ తీసుకుంటున్న టైంతో పోలిస్తే అది చాలా తక్కువ అని అభిప్రాయపడుతున్నారు.