ఆరు నెలల పాప మరణం సాయి ధరమ్ తేజ్ కి కనపడలేదా!
on Jul 16, 2024
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (sai dharam tej) సిల్వర్ స్క్రీన్ మీదే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని నిరూపించుకుంటున్నాడు. ఇందుకు నిదర్శనమే ఇటీవల సంచలనం సృష్టించిన ప్రణీత్ హనుమంత్ కేసు. హనుమంత్ ని కోర్ట్ మెట్లు ఎక్కించి జైలు శిక్ష పడే దాకా తేజ్ పట్టు వదలకుండా ప్రయత్నించాడు. తెలంగాణ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ఆ కేసు ని తీసుకెళ్లాడు. దీన్ని బట్టి తేజ్ కమిట్ మెంట్ ని అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తేజ్ కి కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా యాభై సంవత్సరాలు దాటిన ఒక వ్యక్తి తాను మనిషిననే విషయాన్ని మర్చిపోయి మృగం లా ప్రవర్తించాడు. సుమారు ఆరు నెలల వయసు ఉన్న పాపని మానభంగం చేసాడు. దీంతో పాప అక్కడిక్కడే చనిపోయింది. ఇప్పుడు ఈ విషయం మానవ హృదయాల్ని కలిచి వేస్తుంది.
ఇప్పుడు ఈ విషయాన్నీ నెటిజన్స్ సాయి ధరమ్ తేజ్ దృష్టికి తీసుకొస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సదరు విషయాన్ని తేజ్ కి టాగ్ చేస్తు ఇది మీ దృష్టికి రాలేదా. ఈ విషయాన్నీ కూడా ఒక ఉద్యమం గా తీసుకొని నిందుతుడి కి శిక్ష పడేలా చెయ్యాలని ఎవర్నేస్ తీసుకురావాలని కోరుతున్నారు.
Also Read