పదిహేను సెకన్లలో ఉన్న ఆనందం వేరని బాంబు పేల్చిన తమన్నా
on Jul 13, 2024
తమన్నా(tamannaah)2005 లో సినీ రంగ ప్రవేశం చేసింది. హీరోలకి మాత్రమే లాంగ్ రన్ ఉండే ఇండస్ట్రీలో సుమారు రెండు దశాబ్దాల నుంచి తన సత్తా చాటుతు ఇప్పటి వరకు సుమారు 70 కి పైగా చిత్రాల్లో చేసింది. ఆ లిస్ట్ లో కొన్ని ఐటెం సాంగ్స్ కూడా ఉన్నాయనుకోండి. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన కొన్ని విషయాలు చర్చినీయాంశమయ్యాయి.
ఇప్పుడు కేవలం పదిహేను సెకన్ల పాటు వచ్చే రీల్స్ ని చూసే వారు ఎక్కువయ్యారు.పైగా అవి ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
దాంతో అలాంటి వారి దృష్టిని ఆకర్షించడం నటి నటులకి పెద్ద సవాలుగా మారింది. పైగా వాళ్లకి నచ్చిన కథలని తీసుకు రావడమే పెద్ద సవాలుగా మారింది. ఒక విధంగా ఆ రీల్స్ పోటీగా కూడా నిలిచాయి. అలాగే ఒకప్పుడు థియేటర్స్ లోనే సినిమాల హవా ఉండేది. కానీ ఇప్పుడు ఓటిటి వేదికగా చాలా చిత్రాలు వస్తున్నాయి. పైగా అవి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి.సింపుల్ గా చెప్పాలంటే కాలం మారింది. మనం కూడా మారాలని చెప్పుకొచ్చింది.అందుకు తగ్గట్టే పలు వెబ్ సిరిస్ లు కూడా చేస్తూ వస్తుంది. అలాగే ఇండస్ట్రీ లో తను ఏం సాధించిందో కూడా తెలిపింది.
చిన్నప్పటి నుంచి నటిని కావాలనే లక్ష్యంతోనే పెరిగాను. ఆ కలలు నన్ను ఎక్కడ దాకా తీసుకెళ్తాయో అనే విషయం తెలియకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. ఎన్ని సవాళ్ళయినా ఎదుర్కొని ఇక్కడి నుంచి మాత్రం వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత నూటికి నూరు శాతం కష్టపడి పని చేసా.చివరకి నేను అనుకున్నది సాధించాను. ఆ విషయంలో ఆనందం, సంతృప్తి రెండు ఉన్నాయని చెప్పింది.
Also Read