చంచల్‌గూడ జైలుకి యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు!
on Jul 11, 2024
వివాదాస్పద యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు (Praneeth Hanumanthu) ను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నాంపల్లి కోర్టులో ప్రణీత్ ను హాజరు పరచగా.. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ప్రణీత్ ని చంచల్ గూడ జైలుకు తలరించారు.
ప్రణీత్ హనుమంతు (phanumantu) ఒక యూట్యూబర్. ఫన్ పేరుతో ఇతరులను ఎలాపడితే అలా ట్రోల్ చేస్తూ, రోస్ట్ వీడియోలు చేయడమే ఇతని పని. ఇటీవల ఒక చిన్నారితో ఆమె తండ్రి ఉన్న వీడియోపై.. తన ఫ్రెండ్స్ తో కలిసి యూట్యూబ్ లైవ్ లో ప్రణీత్ వల్గర్ కామెంట్స్ చేశాడు. మాటల్లో చెప్పడానికి కూడా వీల్లేని, అసహ్యమైన కామెంట్స్ అవి. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ప్రణీత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై హీరో సాయి ధరమ్ తేజ్ ఘాటుగా స్పందించడంతో.. ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా చేరింది. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఇలా అందరూ స్పందించి.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసు శాఖ కూడా వెంటనే స్పందించి కేసు నమోదు చేయడమే కాకుండా.. బెంగుళూరు వెళ్ళి అతనిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ప్రణీత్ తో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు.
Also Read