సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ ల పోటాపోటీ వార్నింగ్
on Jul 8, 2024
సోషల్ మీడియాలో కొంత మంది మానవ సైతానులు చేసిన పనికి ప్రపంచ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. అందరు కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.ప్రముఖ హీరోలు సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ లు అయితే వాళ్లని వదిలే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటో చూద్దాం.
సోషల్ మీడియా ద్వారా ఎంత మంచి జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుంది. నిత్యం ఎన్నో ఘటనలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. కానీ రీసెంట్ గా కొంత మంది యువకులు మాట్లాడిన మాటలు మాత్రం అత్యంత జుగుప్సాకరం. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు. వాళ్ల బి హేవియర్ కి సభ్య సమాజం మొత్తం తల దించుకునే పరిస్థితి. మేము బతుకుతున్న జీవితం తల్లి తండ్రి ప్రసాదించిందని మర్చిపోయి మృగాల కంటే హీనంగా ప్రవర్తించారు. కొంత మంది ఇన్ స్టాగ్రాం వీడియో కాల్‌లో మీట్ అయ్యారు. తండ్రి కూతురు బంధం గురించి తప్పుగా మాట్లాడారు. పైగా ఆ మాటలకి వికటాహాసాన్ని కూడా పొందారు. ఇప్పుడు ఈ వీడియో మీద అందరు ఫైర్ అవుతున్నారు.వాళ్ళు మనుషులా, రాక్షసులా అనే డౌట్ ని కూడా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా ఈ విషయం మీద సాయి ధరమ్ తేజ్ (sai dharam tej) స్పందించాడు.సదరు వీడియోని టాగ్ చేస్తు అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేసాడు. ఆలాగే ఇరు రాష్టాల సీఎం, డిప్యూటీ సీఎంలకు కూడా ట్యాగ్ చేశాడు. ఆ వెంటనే వారు స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇక మంచు మనోజ్(manchu manoj)కూడా స్పందించాడు. అందులో ఉన్న ఒక వ్యక్తి పేరు హన్మంతు. గత ఏడాది ఇన్ స్టాగ్రాం ద్వారా సంప్రదించాను.మహిళలు ఎదుర్కొంటోన్న వివక్ష, దారుణాల మీద పోరాడేందుకు సాయం చేస్తాడేమో అని గత ఏడాది సంప్రదించాను. కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇలాంటి వీడియోలతో కనిపించాడు. అతనితో చేసిన మెసెజ్‌లు, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అవసరమైనప్పుడు వాటిని పంపిస్తానని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, టెక్సాస్ ప్రభుత్వానికి, ఇండియన్ యూఎస్ ఎంబసీకి టాగ్ చేసాడు. అదే విధంగా హన్మంతు.. నిన్ను వదిలే ప్రసక్తి లేదు.. అమ్మ తోడు అంటూ వార్నింగ్ లాగా ఇచ్చాడు. ఇక వాళ్ళల్లో ఒకడైన హన్మంతు తల్లిదండ్రులు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారని తెలుస్తుంది.
Also Read