ఖాకీ డ్రెస్ లో 'ఓజీ' బ్యూటీ!
on Jul 7, 2024
'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న సినిమాలు 'సరిపోదా శనివారం', 'ఓజీ'. ఈ రెండు సినిమాల్లోనూ ప్రియాంక మోహన్ హీరోయిన్ కావడం విశేషం. తాజాగా 'సరిపోదా శనివారం' నుంచి ఆమె ఫస్ట్ లుక్ విడుదలైంది.
'అంటే సుందరానికీ' తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'సరిపోదా శనివారం'. ఈ సినిమాలో చారులత పాత్రలో ప్రియాంక నటిస్తోంది. ఆమె పాత్రకు సంబంధించిన లుక్ ని తాజాగా రివీల్ మేకర్స్. చారులతగా పోలీస్ దుస్తుల్లో ప్రియాంక లుక్ ఆకట్టుకుంటోంది.
'సరిపోదా శనివారం' మూవీ ఆగష్టు 29న విడుదల కానుంది. ఈ సినిమాలో నాని.. సూర్య అనే పాత్రలో కనిపించనున్నాడు. శనివారం నాడు మాస్ గా, మిగతా రోజుల్లో క్లాస్ గా కనిపించే సరికొత్త పాత్రలో అలరించనున్నాడు.