ఓటీటీలోకి టాప్ రేటింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
on Jul 6, 2024
కొన్ని సినిమాలు ఇతర భాషలలో విడుదలై ఎంతో సక్సెస్ అవుతాయి. వాటిని ఓటీటీ వేదికలు ఇతర భాషల్లోకి అనువాదించి విడుదల చేస్తుంటారు. అయితే వాటిల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన ఓ టాప్ రేటింగ్ సినిమా తెలుగులోకి రానుంది.
హీరో రాజ్ కుమార్ రావు, అలయా ఎఫ్ ప్రధాన పాత్రలుగా నటించారు. జ్యోతిక కీలక పాత్రలో కన్పించింది. ఈ మూవీకి తుషారా హీరానందిని దర్శకత్వం వహించగా భూషణ్ కుమార్, నిధి పర్మార్ సంయుక్తంగా నిర్మించారు. జూలై 5 నుండి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. బాలీవుడ్ లో ఈ సంవత్సరం మే 10 న థియేటర్లలో విడుదలైన ' శ్రీకాంత్'.. అత్యధిక వసూళ్ళని సాధించింది. ఇక నిన్నటి నుండి స్ట్రీమింగ్ కానుందని అఫీషియల్ గా మేకర్స్ ప్రకటన విడుదల చేయగా.. ఒక్క హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ మూవీ కథ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా నిజ జీవితం ఆధారంగా ఈ మూవీని తీసారు. శ్రీకాంత్ కి దృష్టి లోపం ఉన్నప్పటికి ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని జీవితంలో తన లక్ష్యాన్ని ఛేదించాడు. అతని జీవితం స్ఫూర్తిదాయకంగా ఉందని అందరికి చేరాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ మూవీని తెరకెక్కించారు. IMDb 7.9 రేటింగ్ తో ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. మరి ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సినిమాని ఓసారి చూసేయ్యండి.
Also Read