'దేవర' సెకండ్ సింగిల్.. ఎన్టీఆర్, జాన్వీ రొమాన్స్ అదిరింది!
on Jul 6, 2024
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర' (Devara). యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ కాగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది.
అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న 'దేవర' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ఫియర్ సాంగ్' కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రెండో సాంగ్ విడుదలకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. సెకండ్ సింగిల్ గా రొమాంటిక్ సాంగ్ విడుదల కానుందట. దీనిని జూలై 19న విడుదల చేయనున్నారని సమాచారం.
కాగా, ఇటీవల గోవాలో ఎన్టీఆర్-జాన్వీ లపై ఈ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరిగింది. ఈ సాంగ్ లో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందట. ఇప్పుడు ఆ పాటే సెకండ్ సింగిల్ గా రానుందని టాక్. ఎన్టీఆర్, జాన్వీ ల రొమాన్స్ ని లిరికల్ వీడియోలో శాంపిల్ గా చూపిస్తారని.. థియేటర్లో ఫుల్ వీడియో సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ రావడం ఖాయమని అంటున్నారు.
Also Read