ఇది ప్రభాస్ పేరే కదా.. హీరోయిన్ పొడిపించుకుంది
on Jul 3, 2024
సమ్ థింగ్.. సమ్ థింగ్.. సమ్ థింగ్.. అందరిలోన ఏదో సమ్ థింగ్ ఉంటుందనేది ఒక కవి ఉవాచ. అందుకు సాక్ష్యంగా ఇప్పుడు ఒక టాటూ ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తుంది. టాటూ షేక్ చెయ్యడం ఏంటని అనుకోకండి. ఎందుకంటే అది అలాంటి ఇలాంటిది కాదు. బాలీవుడ్ బ్యూటీ ట్ దిశా పటాని (disha patani)టాటూ.. అసలు విషయం ఏంటో చూద్దాం.
2015 లో వరుణ్ తేజ్ హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన లోఫర్ ద్వారా దిశా సినీ రంగ ప్రవేశం చేసింది. మూవీ సక్సెస్ అయ్యి ఉంటే మరిన్ని తెలుగు సినిమాల్లో ఆఫర్స్ వచ్చేవి. కానీ పరాజయం పాలవ్వడంతో బాలీవుడ్ కి మకాం మార్చేసింది. ధోని, భాగీ 2 , భాగీ 3 ,యోధ, మలాంగ్, ఏక్ విలన్ రిటర్న్స్ లాంటి హిట్ చిత్రాల ద్వారా గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ చేతి మీద ఒక టాటూ ఉంది. ఇప్పుడు అది పబ్లిక్ కంట పడింది. పీడీ అనే పేరుతో ఉండటంతో ఇప్పుడు ఆ పేరు అందరిలో కొత్త చర్చలకి దారితీసింది.కొందరేమో పీడీ అంటే ప్రభాస్, దిశా పటానీ అని మరికొందరు పీడీ అంటే ప్రభాస్ డార్లింగ్ అనే అర్ధం అని అంటున్నారు.
ఇద్దరి ఫ్యాన్స్ అయితే ఏకంగా ఆ పేరుపై పెద్ద రీసర్చే చేస్తున్నారు. దిశా పటాని గత చిత్రాల్లో నటించిన హీరోల దగ్గర నుంచి ఆమెతో క్లోజ్ గా ఉండే వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. అలా సేకరించి పీడీ అనే పేరుకి మ్యాచ్ అవుతుందేమో చెక్ చేస్తున్నారు. వాళ్ళ రీసర్చ్ సక్సెస్ అయినా అవ్వకపోయినా కాలమే నిజాన్ని చెప్తుంది. ఇక ప్రభాస్ (prabhas)దిశా లు లేటెస్ట్ గా కల్కి (kalki)లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ప్రభాస్ ని ఇష్టపడే అమ్మాయిగా దిశా చేసింది. నిడివి కాసేపే అయినా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తుంది. సూర్య పాన్ ఇండియా మూవీ కంగువాలో కూడా హీరోయిన్ గా చేస్తుంది. ఎక్కువ మంది ప్రభాస్ పేరే అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read