‘వస్తున్నా..’ అంటూ ట్వీట్ చేసిన మోక్షజ్ఞ.. సంబరాలు చేసుకుంటున్నా ఫ్యాన్స్!
on Jul 1, 2024
నటసింహ నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఇండస్ట్రీతోపాటు నందమూరి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ హీరోగా రాబోతున్నాడు అని అభిమానులు అని ఆశలు పెట్టుకోవడం, చివరికి అది జరగకపోవడంతో నిరాశ చెందడం అభిమానులకు అలవాటుగా మారిపోయింది. ఈ విషయం గురించి బాలయ్యను ఎప్పుడు అడిగినా తప్పకుండా వస్తాడు అని చెప్పడమే తప్ప దాని గురించి క్లారిటీ లేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా తన ట్విట్టర్‌లో కొత్త లుక్‌తో ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశాడు మోక్షజ్ఞ. ‘వస్తున్నా..’ అని క్యాప్షన్ పెట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన తర్వాత నందమూరి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. తమ అభిమాన హీరో తనయుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడంటే అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంది. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



