నాకు మానవత్వం ఉంది.. అతనికొక నమస్కారం అంటున్న నాగార్జున
on Jun 24, 2024
టాలీవుడ్ అగ్ర హీరోనాగార్జున(nagarjuna)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక్యంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కొన్ని లక్షలాది మంది అభిమానులు ఆయన సొంతం. వాళ్లంతా మేము నాగ్ ఫ్యాన్స్ అని గర్వంగా చెప్పుకునే రీతిలో ఆయన నటన ఉంటుంది. కళకి సంబంధించి ఎన్నిరసాలు దాగి ఉన్నాయో అన్నింటిలోను తన సత్తా చాటగలడు. తెలుగు సినిమా పరిశ్రమ నుండి మొట్టమొదటి సౌత్ సూపర్ స్టార్ నాగ్ నే.అదే విధంగా తెలుగు సినిమాకి మొట్టమొదటి సారి పాన్ ఇండియా లుక్ ని తెచ్చిన హీరో కూడా నాగ్ నే. లేటెస్ట్ గా ఆయనకీ సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీంతో రంగంలోకి దిగాడు.
రీసెంట్ గా నాగార్జున ఎయిర్ పోర్ట్ లో ఉండగా ఒక అభిమాని నాగ్ దగ్గరకి వచ్చి ముట్టుకోబోయాడు. అంతలో నాగ్ కి చెందిన పర్సనల్ సెక్యూరిటీ వచ్చి అతన్ని ఒక్కసారిగా పక్కకి నెట్టి పడేసాడు. అతను కింద కూడా పడబోయే వాడు. కాకపోతే పక్కన ఉన్న వారు పట్టుకున్నారు. కానీ నాగార్జున మాత్రం అతన్ని పట్టించుకోలేదు. అంటే ఏదో ఆలోచనతో వెళ్ళిపోతున్నాడు. ఈ విషయం వీడియోలో స్పష్టంగా ఉంది. ఇక ఒక నెటిజన్ ఆ వీడియోని ఎక్స్ వేదికగా నాగ్ కి షేర్ చేస్తు మానవత్వం ఎక్కడికి పోయిందని వ్యాఖ్యానించింది. దీంతో నాగ్ రిప్లై ఇచ్చాడు. ఆ విషయం నా దృష్టికి వచ్చింది. అలా జరిగి ఉండకూడదు. నేను ఆ పెద్దమనిషికి క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో ఆ విధంగా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు. పైగా నమస్కారం అనే ఎమోజీని కూడా పోస్ట్ చేసాడు. ఇక సంఘటన జరిగిన కాసేపటికే నాగ్ స్పందించడం పట్ల పలువురు అప్రీషియేట్ చేస్తున్నారు. ఇక ఆ వీడియో లో నాగ్ వెనుక అగ్ర హీరో ధనుష్(dhanush)కూడా ఉన్నాడు. నాగ్ సెక్యూరిటీ నెట్టిన వ్యక్తి హ్యాండీ క్యాప్ పర్సన్. ఎయిర్ పోర్ట్ లోనే పని చేస్తున్నాడని అతని డ్రెస్ కోడ్ ని చూస్తే అర్ధం అవుతుంది.
ఇక నాగ్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల (shekar kammula)డైరెక్షన్స్ లో కుబేర చేస్తున్నాడు. ఇందులో ధనుష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇండియాలోనే మరో బిగ్గెస్ట్ మల్టిస్టారర్ ఇది. ఇటీవలే నాగ్ కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేస్తే యూ ట్యూబ్ లో రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది. నాగ్ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి టైం లో రావచ్చనే టాక్ ఉంది. నాగ్ లాస్ట్ సంక్రాంతికి నా సామి రంగ తో వచ్చి హిట్ కొట్టిన విషయం అందరకి తెలిసిందే.
Also Read