అనన్యకు ప్లాస్టిక్ సర్జరీ.. అవి పెరిగేందుకేనా?
on Jun 18, 2024
సినిమా రంగంలో తమ వారసుల్ని హీరోలుగా, హీరోయిన్లుగా పరిచయం చేయడం సహజమే. అయితే ఆడపిల్లలను సినిమా రంగానికి పరిచయం చేసేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ, బాలీవుడ్‌లో అలాంటి నిబంధన ఏమీ పెట్టుకోలేదు. అందుకే హీరోల కూతుళ్ళు కూడా హీరోయిన్లుగా పరిచయమై తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అలా హీరోయిన్‌గా పరిచయమైంది చంకీ పాండే కుమార్తె అనన్య పాండే. బాలీవుడ్‌లో తను చేసే సినిమాలతో బిజీగానే ఉన్న అనన్య తెలుగులో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లైగర్’తో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమా అనూహ్యంగా డిజాస్టర్ కావడంతో ఆమెకు పెద్ద షాక్ తగిలింది. దీంతో సౌత్‌ను వదిలేసి బాలీవుడ్‌పైనే కాన్‌సన్‌ట్రేట్ చేస్తోంది.
‘బ్యాడ్ న్యూస్’, ‘కంట్రోల్’, ‘శంకరా’ వంటి సినిమాలతో బిజీగా ఉంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు తన గ్లామర్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె ఫేస్‌లో చాలా మార్పులు రావడం గమనించారు. ముఖ్యంగా ఆమె పెదవులు గతంలో మాదిరిగా కాకుండా కొంత షేప్ మారినట్టు కనిపించాయి. దీంతో అనన్య ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే వార్త ఒక్కసారిగా గుప్పుమంది. ఇప్పుడా న్యూస్ బాగా వైరల్‌గా మారింది. దీనిపై అనన్య పాండే ఎలాంటి కామెంట్ చేయకపోవడంతో అది నిజమేనని అందరూ నమ్ముతున్నారు.