లోకేష్‌కి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
on Jun 17, 2024
ఒక సినిమా విజయవంతంగా పూర్తి కావాలంటే టీమ్ వర్క్ ఎంతో అవసరం అనే విషయం అందరికీ తెలిసిందే. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మధ్య సరైన సమన్వయం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. సినిమా మేకింగ్‌లో అభిప్రాయ భేదాలు, మనస్పర్థలు వంటివి రావడం సర్వసాధారణమైన విషయం. అయితే అవన్నీ తాత్కాలికమే. తర్వాత అందరూ మర్చిపోతారు. కానీ, కొన్ని విషయాలు మాత్రం కాంట్రవర్సీకి దారితీస్తాయి. ఒకప్పటి పరిస్థితి వేరేలా ఉన్నప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియా బాగా విస్తరించి ఉండడంతో సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోందనే విషయాలపై అందరూ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.
డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌పై సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆ మ్యాటర్ అలాంటిది. లోకేష్ డైరెక్షన్‌లో 171వ సినిమాగా రజినీ చేయబోతున్న ‘కూలి’ షూటింగ్ జూలైలో ప్రారంభిస్తారని అంతా అనుకున్నారు. ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా కోసం తన 170వ సినిమా ‘వేట్టయాన్’ను వేగంగా పూర్తి చేస్తున్నారు రజినీ.
ఇదిలా ఉంటే.. ‘కూలి’ చిత్రం అనుకున్న టైమ్‌కి స్టార్ట్ చెయ్యలేకపోతున్నారని తెలిసి డైరెక్టర్ లోకేష్‌పై రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారట. దానికి కారణం లోకేష్ ఇంకా స్క్రిప్ట్ వర్క్ మీదే ఉన్నాడని, ఆ వర్క్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేస్తానని లోకేష్ చెప్పడం వల్లే రజినీ ఆగ్రహించారని సమాచారం. దీన్ని బట్టి ‘కూలి’ జూలైలో స్టార్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసేందుకు లోకేష్ ఇంకా ఎన్నిరోజులు తీసుకుంటాడు అనే విషయంలో క్లారిటీ లేదని అర్థమవుతోంది. దీనికి సంబంధించి వైరల్ అవుతున్న వార్తపై మేకర్స్‌గానీ, లోకేష్‌గానీ స్పందించకపోవడం గమనార్హం. వారి మౌనం చూస్తుంటే ‘కూలి’ ప్రారంభం కావడానికే చాలా రోజులు పడుతుందనే వార్తకు బలం చేకూరింది.
Also Read