ఫ్యామిలీ స్టార్ ఇక లేనట్టేనా! దిల్ రాజు నుంచి రెస్పాన్స్ లేదు
on Apr 13, 2024
విజయ్ దేవరకొండ హీరోగా మొన్న ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఫ్యామిలీ స్టార్. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ బాధ్యతలని వహించాడు. పబ్లిక్ రెస్సాన్స్ అయితే అంతగా లేదు. రివ్యూస్ కూడా గొప్పగా లేవు. దీంతో మా సినిమా బాగున్నా బాగోలేదని అంటున్నారని దిల్ రాజు కొన్ని మీడియా ఛానల్స్ మీద పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఆ విషయాలన్నీ పక్కన పెడితే తాజా న్యూస్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
రిలీజ్ కి ముందు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ ఒక లెవల్లో జరిగాయి. వాటిల్లో దిల్ రాజు కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలుగులో రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత ఫ్యామిలీ స్టార్ హిందీ,మలయాళంలో కూడా రిలీజ్ అవుతుందని చెప్పాడు. డేట్ ని కూడా త్వరలోనే ప్రకటిస్తాం అని చెప్పాడు. మరి ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యి వారం పైనే అవుతుంది. ఇంత వరకు అప్ డేట్ లేదు. దీంతో ఆ ప్రయత్నాన్ని దిల్ రాజు విరమించుకున్నాడేమో అనే మాటలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే సాధారణంగా ఏ లాంగ్వేజ్ కి సంబంధించిన సినిమా అయినా అధర్ లాంగ్వేజ్ లో ఒక వారం తర్వాతనే రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అవ్వడం సినిమాకే ప్లస్ అవుతుంది. మరి ఆ విషయంలో ఎలాంటి న్యూస్ ఇప్పటివరకు రాలేదు. కనీసం ఆ లాంగ్వేజెస్ లో ప్రమోషన్స్ ఊసే కనపడటం లేదు. ఓటిటి టైంలో డైరెక్ట్ గా ఆ రెండు వెర్షన్స్ ఆడియన్స్ కి అందుబాటులోకి వస్తాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
మూవీ అయితే కంప్లీట్ ఫ్యామిలీ సబ్జెక్ట్. విజయ్ అండ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. మిగతా పాత్రల్లో నటించిన జగపతి బాబు,రోహిణి హట్టంగడి, వెన్నెల కిషోర్, వాసుకి, అభినయలు కూడా చాలా బాగా నటించారు. గోపి సుందర్ సంగీతాన్ని అందించగా తెలుగుతో పాటు తమిళంలోను ఒకేసారి రిలీజ్ అయ్యింది. ప్రస్థుతానికి కలెక్షన్స్ డల్ గానే ఉన్నాయి.
Also Read