అల్లు అర్జున్, త్రివిక్రమ్ నాలుగో సినిమా.. ఊహించని ట్విస్ట్!
on Apr 8, 2024
టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో ఒకటి. ఇప్పటిదాకా వీరి కలయికలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు రాగా.. మూడూ విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని అందుకుంది. ఇక వీరి కాంబినేషన్ లో నాలుగు సినిమా రానుందంటూ గతేడాది ప్రకటన వచ్చింది. అయితే కొద్దిరోజలుగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవ్వగా.. తాజాగా ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప-2' చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నాలుగో సినిమా చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. అయితే త్రివిక్రమ్ గత చిత్రం 'గుంటూరు కారం' నిరాశపరచడంతో.. ఈ ప్రాజెక్ట్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు బన్నీ.. డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా కమిట్ అయ్యాడని న్యూస్ రావడంతో.. ఇక త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లేనట్లేనని పలువురు అభిప్రాయపడ్డారు. ఇలాంటి తరుణంలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల నాలుగో సినిమా.. హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో రూపొందనున్నట్లు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందన్న వార్తల నేపథ్యంలో తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ తో బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలకు చెక్ పెట్టారు. ప్రొడక్షన్ నెం.8 గా ఈ చిత్రం రూపొందనుందని, అల్లు అర్జున్ తో కలిసి మళ్ళీ వర్క్ చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని మేకర్స్ పేర్కొన్నారు. మరి మొదటి మూడు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న బన్నీ-త్రివిక్రమ్ కాంబో.. నాలుగో సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
Also Read