‘మతిమారన్’ మూవీ రివ్యూ
on Apr 2, 2024
మూవీ : మతిమారన్
నటీనటులు: వెంకట్ సెంగుట్టువన్ , ఇవానా, ఆరాధ్య, ఎమ్ఎస్ భాస్కర్, ఆడుకలమ్ నరేన్, బావ చెల్లాదురై తదితరులు
ఎడిటింగ్: సతీష్ సుప్రియ
సినిమాటోగ్రఫీ: పర్వీజ్ కె
మ్యూజిక్: కార్తిక్ రాజా
నిర్మాతలు: లెనిన్ బాబు
రచన, దర్శకత్వం: మంత్ర వీరపాండియన్
కథ:-
చైన్నైలోని ఓ ప్రాంతంలో అర్థరాత్రి ఒకతను మటన్ కొట్టులో మటన్ తో పాటు ఓ చేతిని ముక్కలు ముక్కలుగా నరికేసి దానిని బ్యాగ్ లో వేసుకొని చెరువులో పడేస్తాడు. ఆ తర్వాత నెడుమారన్(వెంకట్ సెంగుట్టువన్) అనే పొట్టి వ్యక్తి బావిలో కూర్చొని బాధపడుతూ తన లైఫ్ లో ఏదీ సాధించలేదని ఏడ్చి బావిలో దూకి చనిపోవాలనుకుంటాడు. అదేసమయంలో అతని నాన్న చెప్పిన ' మథి జాగ్రత ' అని గుర్తొచ్చి తొందరగా బయటకి వస్తాడు. ఇక బయటకొచ్చి మథి స్నేహితురాలి దగ్గరికి వెళ్ళి అడ్రెస్ కనుక్కుంటాడు. ఇక తన కోసం హైదరాబాద్ కి వెళ్తాడు నెడుమారన్. పోస్ట్ మాన్ సుందరం భార్యకి ఒకే కాన్పులో ఇద్దరు కవలలు జన్మిస్తారు. ఒకరు పొట్టిగా ఉండే నెడుమారన్, మరొకరు మథి.. ఇక మథిని వెతుక్కుంటు నెడుమారన్ వెళ్తాడు. ఇక అదే సమయంలో సిటీలో వరుసగా ఆరుగురు అమ్మయిల హత్యలు జరుగుతాయి. అ హత్యలుచేస్తుందెవరు? నెడుమారన్, మథిలకి మధ్య గొడవేంటి? అసలు నెడుమారన్ ఎందుకు చనిపోవాలనుకున్నాడు లాంటివి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:-
ఓ అమ్మాయిని ముక్కలుగా నరికి చెరువులో పడేయడం, మరోవైపు నెడుమారన్ సూసైడ్ చేసుకోవాలనుకోవడం లాంటి అంశాలతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. సమాజంలో ఓ వ్యక్తి బ్రతకాలంటే అతనికి ఉండాల్సింది ఎత్తు, లావు, అధికారం, డబ్బు కాదని నిరూపిస్తూ సాగే కథనం ప్రేక్షకుడిని ఆలోచింపజేసేవిలా ఉన్నాయి.
స్క్రీన్‌ప్లే గ్రిస్పింగ్ ఉండటంతో మూవీ ఎక్కడ బోర్ అనిపించదు. ఓ వైపు సీరియల్ మర్డర్స్, మరోవైపు తన అక్క మథి కోసం నెడుమారన్ పడే బాధ అందరికి నచ్చేస్తుంది. ప్రథమార్ధంలో పోలీసుల అసమర్థతని చూపిస్తూనే ఓ తెలివైన వాడి సహాయం తీసుకొని కేసుని సాల్వ్ చేయడం లాంటివి బాగున్నాయి.
క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవాడి మనస్తత్వాన్ని పరిగణలోకి తోసుకోవడానికి చదువు, పదవులు అవసరం లేదని సాగే క్యాట్ అండ్ మౌస్ ఇన్వెస్టిగేషన్ ప్రేక్షకుడిలో ఓ ఇంటెన్స్ ని క్రియేట్ చేసింది. ఇక క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ తో అందరు ఆశ్చర్యపోతారు. ఎవడబ్బా సొత్తు కాదు ట్యాలెంట్ అనేది ఈ సినిమా చివరలో తెలుస్తుంది. " కాకి నల్లగా ఉన్నదని ఎప్పుడు ఫీల్ అవ్వదు.. కొంగ తెల్లగా ఉందని ఎప్పుడు గర్వపడదు.. కానీ మనిషి మాత్రమే పొట్టి, పొడుగు, రంగు, గుణం, డబ్బు, మర్యాద అనే పోలికలతో సాటి మనుషులని అంచనా వేస్తున్నారు " అంటూ సాగే కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసేవిలా ఉన్నాయి.
సినిమాలో ఎక్కడ అడల్ట్ సీన్స్ లేవు. అసభ్య పదజాలం వాడలేదు. నిడివి గంట యాభై తొమ్మిది నిమిషాలే ఉండటం, అందులోనే అయిదు పాటలు ఉండటం సినిమాకి మరింత ప్లస్ అయింది. సిద్ శ్రీరామ్, జీవి ప్రకాష్ పాడిన పాటలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ వర్షన్ మాటల విషయంలో మేకర్స్ జాగ్రత్త పడ్డారు. పర్వీజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కార్తిక్ రాజా మ్యూజిక్ సినిమాకి మరింత బలంగా నిలిచింది. సతీష్ సుప్రియ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:-
లవ్ టుడే ఫేమ్ ఇవానా ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. నెడుమారన్ గా వెంకట్ సెంగుట్టువన్ తన ఒదిగిపోయాడు. ప్రతీ ఫ్రేమ్ లో కాన్పిడెన్స్ తో పాటు క్రమశిక్షణని కనబరిచాడు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా ... ఫ్యామిలీతో కలిసి చూసే ఈ సినిమా మంచి సందేశాన్ని ఇస్తుంది.
రేటింగ్ : 2.75 / 5
✍️. దాసరి మల్లేశ్