రణబీర్, రష్మిక రెండేళ్ళ తర్వాతే కలుస్తారన్నారు.. కానీ, సడన్‌గా దర్శనమిచ్చారే!
on Apr 2, 2024
సినిమాల్లోని కొన్ని జంటలు తెరపై చేసే విన్యాసాలతో ప్రేక్షకుల్ని మురిపిస్తారు, మైమరపిస్తారు. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. సాధారణంగా బయట ఏదైనా అందమైన జంట కనిపిస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. అలాగే సినిమాల్లోని కొన్ని జంటలు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలాగే ఉంటాయి. ఈమధ్యకాలంలో అంతగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన జంట రణబీర్ కపూర్, రష్మిక మందన్న. ‘యానిమల్’ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. లిప్ లాక్ సీన్స్‌తో, రొమాంటిక్ సన్నివేశాలతో ప్రేక్షకులకు కనువిందు చేసిందీ జంట. గత డిసెంబర్‌లో విడుదలైన ‘యానిమల్’ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.
‘యానిమల్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ను ప్లాన్ చేశారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఈ సినిమా 2026లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందరి దృష్టీ ఆ సినిమాపైనే ఉంది. ఈలోగా రణబీర్, రష్మిక మరోసారి జంటగా కనిపించి ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చారు. సాఫ్ట్ డ్రిరక్ 7అప్ యాడ్‌లో నటించారు. ఆద్యంతం ఎంతో ఫన్నీగా ఉన్న ఈ యాడ్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ యాడ్‌ను రష్మిక స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ యాడ్ చూసిన నెటిజన్లు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఈ ఇద్దరినీ స్క్రీన్‌పై చూడాలంటే ఇంకా చాలా కాలం వెయిట్ చెయ్యక తప్పదు. ఎందుకంటే రణబీర్, రష్మిక, సందీప్.. ముగ్గురూ వివిధ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా సందీప్ చెయ్యబోయే ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌లో ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ ఏడాది ఎండిరగ్‌కి ‘స్పిరిట్’ సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే రణబీర్ తన నెక్స్‌ట్ ప్రాజెక్ట్ ‘రామాయణం’ కోసం కోచింగ్ తీసుకుంటున్నాడట. ఈ సినిమాలో రాముడిగా రణబీర్, సీతగా సాయిపల్లవి నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. నితిష్ తివారి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.
ఇక రష్మిక విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్‌లో ఉంది. ఈ సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సెట్స్‌కి వెళ్తుంది రష్మిక. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది పాన్ ఇండియా లెవల్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత రష్మికకు మరో బాలీవుడ్ ఆఫర్ కూడా ఉంది. ఇలా ఈ ముగ్గురూ వారి వారి ప్రాజెక్ట్స్‌తో ఎంతో బిజీగా ఉన్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాతే 2026లో ‘యానిమల్ పార్క్’తో ఈ ముగ్గురూ కలుస్తారు. అప్పటి వరకు అభిమానులు వెయిట్ చెయ్యక తప్పదు.
Also Read