47 సంవత్సరాలు అయ్యింది...చిరంజీవి సంచలన వ్యాఖ్య
on Apr 1, 2024
కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమాన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన అభిమానులకి ఏజ్ లిమిట్ లేదు. బుడి బుడి నడక నడిచే పిల్లాడి దగ్గర్నుంచి ముదుసలి వరకు ఆ లిస్ట్ లో ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ లు, ఇండస్ట్రీ హిట్ లు చిరు ఖాతాలో ఉన్నాయి. తాజాగా తన కెరీర్ విషయంలో జరిగిన ఒక సంఘటనని చెప్పాడు. ఇప్పుడు అది హాట్ టాపిక్ అయ్యింది.
1977 లో అంటే 47 సంవత్సరాల క్రితం చిరు సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నిస్తు చెన్నై పాండీబజార్ కి వెళ్తుండేవారు. ఆయనలాగే సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్నవాళ్లు పాండి బజార్ లోనే తిరుగుతుండే వాళ్ళు. ఈ క్రమంలో చిరంజీవి ఒకసారి టీ తాగడానికి ఆ ఏరియాకి వెళ్ళాడు. కొంత మంది చిరు తో ఇండస్ట్రీ కి ఏమవుదామని వచ్చావు అని అడిగారు. దాంతో హీరో అవుదామని వచ్చానని చెప్పాడు.వెంటనే అందరు నవ్వి అక్కడే మంచి ముఖ వర్చస్సు హైట్ ఉన్న వ్యక్తిని పిలిచారు. ఇతనికే హీరో అవకాశాలు రావడం లేదు నీకొస్తాయా అంటూ చిరు ని హేళన చేసారు.
పైగా నీ ముఖానికి అంత సీన్ కూడా లేదని చెప్పారు. ఇక అప్పట్నుంచి చిరు పాండి బజార్ వైపు వెళ్ళలేదు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పాడు. నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ఏరియాకి వెళ్తే మనం కూడా అలాగే తయారవుతాము అని వెళ్ళలేదు.ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చిరు ఈ విషయాన్నీ చెప్పాడు. ఆయన మొదటి సినిమా ప్రాణం ఖరీదు 1978 లో విడుదల అయ్యింది. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
Also Read