'టిల్లు 2' హిట్.. 'టిల్లు 3' అనౌన్స్ మెంట్!
on Mar 29, 2024
హిట్ సినిమాకి సీక్వెల్ రావడం కామన్ అయిపోతుంది. 2022లో విడుదలై ఘన విజయం సాధించిన 'డీజే టిల్లు'(DJ Tillu) చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'టిల్లు స్క్వేర్'(Tillu Square). సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు(మార్చి 29) ప్రేక్షకులకు ముందుకు వచ్చి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే పార్ట్-2 విడుదలైన రోజే మేకర్స్ పార్ట్-3 ప్రకటించడం విశేషం.
'టిల్లు స్క్వేర్' మంచి స్పందన లభిస్తుండటంతో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం తమ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ పార్ట్-3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిల్లు-3 ఉంటుందని చెప్పిన ఆయన.. సోమవారం నుంచి థియేటర్లలో 'టిల్లు స్క్వేర్' చివరిలో సిద్ధు వాక్ మీద 'టిల్లు-3' అనౌన్స్ మెంట్ జోడిస్తామని తెలిపారు.
కాగా ప్రస్తుతం సిద్ధు చేతిలో 'జాక్', 'తెలుసు కదా' వంటి సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల తర్వాత 'టిల్లు-3'ని పట్టాలు ఎక్కిస్తారేమో చూడాలి.
Also Read