అల్లు అర్జున్ దుబాయ్ వెళ్ళింది అందుకేనా.. వెరీ ఇంట్రెస్టింగ్!
on Mar 26, 2024
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప2’ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతోంది. ముందుగా ఎనౌన్స్ చేసిన డేట్‌కి సినిమా రిలీజ్ కష్టమని అందరూ భావించారు. కానీ, సుకుమార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అదే రోజు విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్, వైజాగ్ షెడ్యూల్స్‌ను పూర్తి చేసింది యూనిట్. ఇప్పుడు అల్లు అర్జున్‌కి కాస్త రెస్ట్ దొరికినట్టుంది. అందుకే కుటుంబ సమేతంగా సోమవారం దుబాయ్ పయనమయ్యారు. అయితే ఇది వెకేషన్ టూర్ కాదు.
దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఉంచబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి గత ఏడాది అక్టోబర్‌లో దుబాయ్ వెళ్ళి కొలతలు కూడా ఇచ్చి వచ్చాడు బన్ని. మార్చి 28న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకే ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్ళాడు. అయితే ఈ విగ్రహం ఎలా ఉండబోతోంది అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న.. ఎందుకంటే బన్ని కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఏ క్యారెక్టర్‌ను పోలి ఆ విగ్రహం ఉంటుంది అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ‘పుష్ప’ చిత్రంలోని తగ్గేదేలే మేనరిజమ్‌తో ఉంటుందని కొందరు, ‘అల వైకుంఠపురములో..’ చిత్రంలోని రెడ్ జాకెట్ వేసుకున్న స్టైల్‌లో ఉంటుందని కొందరు ఊహిస్తున్నారు. ఇంతకుముందు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో ప్రభాస్, మహేష్‌బాబు విగ్రహాలను ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు విగ్రహాలు లండన్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు ఏ ఇండియన్ యాక్టర్‌కి దక్కని గౌరవం బన్నికి దక్కింది. దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో స్థానం సంపాదించుకున్న తొలి ఇండియన్ యాక్టర్ అల్లు అర్జున్ కావడం విశేషం.
అల్లు అర్జున్ ‘పుష్ప2’ తర్వాత చేయబోయే సినిమాల విషయానికి వస్తే.. సందీప్‌రెడ్డి వంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ కాంబినేషన్‌లో మూడు సినిమాలు చెయ్యాల్సి ఉంది. వీటిలో ఏది ముందు స్టార్ట్ అవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు మొదట అట్లీ సినిమాయే చేసే అవకాశం ఉంది.
Also Read