తిరుమలలో శ్రీదేవి కూతురు చేసిన పనికి ఆశ్చర్యపోయిన భక్తులు
on Mar 21, 2024
ఏడుకొండల వాడికి సామాన్యుల దగ్గర నుంచి సెలెబ్రిటీల దాకా అందరు భక్తులే. ఆయన కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందర్నీ చల్లగా చూస్తాడనుకోండి. ఇక సినీ సెలెబ్రిటీస్ గురించి అయితే చెప్పక్కర్లేదు. తమ సినీ జీవితం గొప్పగా ఉండాలని నిత్యం ఎంతో మంది స్వామిని దర్శించుకుంటారు. ఆ కోవలోనే తాజాగా ఒక హీరోయిన్ ఏడుకొండలవాడిని దర్శించుకుంది. కాకపోతే ఆమె స్వామిని దర్శించుకున్న విధానం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాల మీద ఫోకస్ పెట్టింది.రీసెంట్ గా తిరుమల వచ్చింది. కాలి నడకన కొండకి చేరుకొంది. ఆ పై మోకాళ్లపై నడుచుకుంటూ మోకాళ్ళ పర్వతాన్ని ఎక్కింది. మాములు మనలాంటి వాళ్ళమే మోకాళ్ళ పై మోకాళ్ళ పర్వతాన్ని ఎక్కడానికి చాలా కష్టపడతాం. అలాంటిది జాన్వీ లాంటి సెలబ్రిటీ కష్టాన్ని మర్చిపోయి అలా ఎక్కడం నిజంగా గ్రేట్. ఆ సమయంలో ఉన్న కొంత మంది భక్తులు జాన్వీని చూసి ఆశ్చర్యపోయారు.అలాగే ఈ సంఘటనతో జాన్వీ వేంకటేశ్వర స్వామి భక్తురాలనే విషయం కూడా అందరకి అర్ధం అయింది. ఆ తర్వాత మనసు నిండా భక్తిని నింపుకొని స్వామిని దర్శించుకొని పులకరించిపోయింది. జాన్వీ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
జాన్వీ ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర లో చేస్తుంది.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీంతో పాటు చరణ్ కొత్త మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే ఆ చిత్రం ప్రారంభం అయ్యింది. ఆమె చేస్తున్న ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జట్ చిత్రాలే. పైగా టాలీవుడ్ అగ్ర హీరోలవి కావడంతో ఫ్యూచర్ లో జాన్వీ తెలుగు సినిమాని ఏలడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. తన తల్లి శ్రీదేవి అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు.