నా పెళ్ళాం దెయ్యం.. అంటున్న ఆర్జీవీ!
on Mar 21, 2024
రామ్ గోపాల్ వర్మ ఎం చేసినా అది సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ మాత్రం బాగా వైరల్ అవుతోంది. ఆడవాళ్లను కించపరచడంలో, వాళ్ళను ఆకాశానికి ఎత్తేయడంలో ఆర్జీవీ ఎక్కడా తగ్గడు. రీసెంట్ గా "నా పెళ్ళాం దెయ్యం నీ పెళ్ళాం కాదా ? అంటూ ఒక మూవీ పోస్టర్ ని వెరైటీ టైటిల్ తో రిలీజ్ చేసాడు రాము. ఒక టేబుల్ మీద తీసేసిన తాళిబొట్టు పెట్టి దాని మీద ఈ టైటిల్ ని వేసాడు. అలాగే ఆ పక్కనే కిచెన్ లో వంట చేస్తున్న ఒక మహిళను బ్లర్ లో చూపించాడు. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక కొంత కలం తర్వాత తన భార్యను ఒక దెయ్యంలా ఎందుకు భావిస్తాడు ఆ భర్త అనేది ఈ మూవీ స్టోరీ లైన్ అని కొన్నేళ్ల కిందట ఒక ఇంటర్వ్యూలో ఆర్జీవీ చెప్పాడు.
శివ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రాము తర్వాత కొంతకాలం ఫ్యాక్షన్ పాలిటిక్స్ మీద ద్రుష్టి పెట్టాడు ఆ తర్వాత దెయ్యం స్టోరీలు కూడా తీసాడు. ఇక ఈ పోస్టర్ చూసిన నెటిజన్స్ మాత్రం రాము మీద కామెంట్స్ గుప్పిస్తున్నారు. "టైటిల్ అదిరింది గురువు గారు, ఇలాంటి మూవీస్ తీసుకుంటూ ఉండు హాయిగా, ఇలా చెప్తే ఇంక పెళ్లి అవ్వదు" అంటున్నారు. ఆర్జీవీ టాలీవుడ్ లో తొలి సినిమా శివతోనే సంచలనం రేపి క్షణక్షణం, గోవిందా గోవింద, రాత్రి, దెయ్యం, రంగీలా, సత్య, సర్కార్ లాంటి సినిమాలతో దేశం మెచ్చే డైరెక్టర్ అయ్యాడు. రక్త చరిత్ర తర్వాత ఆర్జీవీ తీసిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ మధ్యే వ్యూహం మూవీతో వచ్చాడు. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం శారీ అనే మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఇది.. మరి రామ్ గోపాల్ వర్మ..రాబోయే మూవీస్ ఆడియన్స్ ని ఎలా అట్ట్రాక్ట్ చేస్తాయో చూడాలి.