ఆ హీరోతో సహజీవనం చేశా..పెళ్లి చేసుకోలేదు..నేను తెలుగు అమ్మాయినే
on Mar 18, 2024
నేను అతన్ని పెళ్లి చేసుకోలేదు. కలిసి సహజీవనం చేసాం. ఇది నిజం.ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కేవలం సహజీవనం మాత్రమే చేసాం. కానీ ఇప్పుడు ఆ బంధానికి కూడా గుడ్ బాయ్ చెప్పాను .ఇక అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. దయ చేసి అతనికి నాకు మధ్య ఏదో ఉందనే వార్తలు రాయకండి. ఈ మాటలన్నింటిని చెప్తుంది ఎవరు? ఎవరి గురించి అవన్నీ చెప్తుందో చూద్దాం.
పెళ్లి సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడుగా మారిన నటుడు పృథ్వీ. కొన్ని వందల చిత్రాల్లో నటించినా కూడా పెళ్లి పృథ్వీ గానే ఇప్పటికి అందరకి గుర్తు ఉన్నాడు.రీసెంట్ గా యానిమల్ లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ పృథ్వీ గురించే శీతల్ అనే అమ్మాయి తన ఇనిస్టాగ్రమ్ ద్వారా చాలా విషయాలని వెల్లడి చేసింది. తనకి పృథ్వీ కి పెళ్లి అయ్యిందని వస్తున్న వార్తలు అబద్దమని కేవలం సజాజీవనం మాత్రమే చేశామని తెలిపింది. అలాగే కొన్ని నెలల క్రితమే విడిపోయామని కూడా చెప్పుకొచ్చింది. మా ఇద్దరి ప్రయాణంలో సంతోషాన్ని పంచుకున్న క్షణాలు ఉన్నాయని చెప్పిన ఆమె తన ఇనిస్టా నుంచి పృథ్వీ ప్రపోజ్ చేసిన వీడియోని డిలీట్ చెయ్యడం గమనార్హం. ఎందుకంటే ఆమె ఎప్పటినుంచో ఆ వీడియోని తన ఇనిస్టా లో ఉంచుతుంది.
ఆమెకి పృథ్వీకి వయసు రీత్యా 25 సంవత్సరాల తేడా ఉంటుంది. గతంలో ఇదే అంశాన్ని శీతల్ దగ్గర ప్రస్తావిస్తే వయసుకి ప్రేమకి సంబంధం లేదని చెప్పింది.ఇక పృథ్వీ కి గతంలోనే బీనా అనే ఆమెతో పెళ్లి జరిగింది. ఆ ఇద్దరకీ ఒక ఒక కొడుకు కూడా ఉన్నాడు. అటిజం అనే అరుదైన వ్యాధితో అతను బాధపడుతున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్లపాటు ఒంటరిగా ఉన్న పృథ్వికి శీతల్ పరిచయం కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. అప్పట్నుంచి ఇద్దరు కలిసే ఉంటున్నారు. 2022 లోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అవన్నీ ఒట్టి పుకార్లు అని తేలింది. హీరోగాను పృథ్వీ చాలా సినిమాల్లో నటించాడు.
Also Read