సర్ ప్రైజ్.. ముందుగానే ఓటీటీలోకి 'భూతద్దం భాస్కర్ నారాయణ'...
on Mar 16, 2024
థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే మెజారిటీ సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ నాలుగు వారాలు కూడా పోయి.. మూడు వారాల ట్రెండ్ మొదలైంది.
శివ కందుకూరి, రాశి సింగ్ ప్రధాన పాత్రల్లో పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'భూతద్దం భాస్కర్ నారాయణ'. శివ కందుకూరి డిటెక్టివ్ గా కనిపించిన ఈ కామెడీ థ్రిల్లర్ మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'భూతద్దం భాస్కర్ నారాయణ' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా దక్కించుకుంది. మార్చి 22 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. "ఇది మీ ఇంటి బయట ఉన్న దిష్టి బొమ్మ కథ... తెలుసుకోరా మరి?. వస్తుంది మీ ఇంటికే మార్చి 22న" అంటూ స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేసింది. అంటే థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతోంది అన్నమాట.
మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్లపై స్నేహాల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముదుంబి ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి ప్రసాద్, షఫీ, శివన్నారాయణ, వెంకటేష్, సురభి తదితరులు నటించిన ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. సినిమాటోగ్రాఫర్ గా గౌతమ్, ఎడిటర్ గా గ్యారీ వ్యవహరించారు.
Also Read