ఓటీటీలోకి 'ఆపరేషన్ వాలెంటైన్'..!
on Mar 10, 2024
విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. పరవాలేదు అనే టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'ఆపరేషన్ వాలెంటైన్' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. మార్చ్ 29 నుంచి ఓటీటీలో 'ఆపరేషన్ వాలెంటైన్' అందుబాటులోకి రానుందని సమాచారం. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది అన్నమాట.