ఓటీటీలోకి నందమూరి హీరో మూవీ.. ఆహా అనాల్సిందే!
on Mar 5, 2024
నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా 'బ్రీత్'. బసవతారక రామ క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహించాడు. ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ గతేడాది డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.
'బ్రీత్' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమాని మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఆహా ప్రకటించింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన నెల రోజులకే చాలా సినిమాలు ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. కానీ 'బ్రీత్' మాత్రం ఏకంగా మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండటం విశేషం.
వైదిక సెంజలియా, వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్, మధు నారాయణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన 'బ్రీత్' సినిమాని మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు. సినిమాటోగ్రాఫర్ గా రాకేష్ హోసమణి, ఎడిటర్ గా బొంతల నాగేశ్వర్ రెడ్డి వ్యవహరించారు.
Also Read