వళరి ట్రైలర్ అదిరింది
on Mar 1, 2024
నేడు పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడా లేదు. కథ కథనాలూ బాగుంటే చాలు ఆ సినిమా పక్కా హిట్ అవుతుంది. అలాగే టైటిల్,ట్రైలర్ బాగుంటే చాలు ఇక ఆ సినిమా కోసం అందరు వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ కోవలోకి వళరి అనే మూవీ వచ్చి చేరింది.
వెంకటేష్ హీరోగా వచ్చిన గురు ఫేమ్ రితిక సింగ్, రోజాపూలు శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వళరి. హర్రర్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. తాజాగా ట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ చూస్తుంటే థ్రిల్లింగ్, హర్రర్ సన్నివేశాలు ఒక లెవల్లో ఉండబోతున్నాయని అర్ధం అవుతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి.సినిమా చూడాలనే ఆసక్తిని కూడా అందరిలోను ట్రైలర్ కలిగించింది.యూట్యూబ్ లో మంచి వ్యూస్ ని కూడా అందుకుంటోంది.
మ్రితికా సంతోషిణి దర్శకత్వంలో తెరకెక్కిన వళరి లో రితిక శ్రీరామ్ ల తో పాటు సుబ్బరాజు, ప్రిన్సెస్ సహారా, ఫర్నిత రుద్రరాజు కీలక పాత్రలు చేస్తుండగా కె. సత్య సాయి బాబు ఎగ్జిగ్యుటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.ప్రముఖ ఓటిటి మాధ్యమం ఈటీవీ విన్ లో మార్చి 6 నుండి టెలికాస్ట్ కానుంది.
Also Read