చిరంజీవి హీరోయిన్ కి ప్రభాస్ సినిమాలో నో ఛాన్స్..త్వరలోనే అందరి పేర్లు చెప్తాం
on Mar 1, 2024
రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ కి సంబంధించిన ఏదో ఒక కొత్త న్యూస్ నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.తాజాగా మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీంతో మేకర్స్ రంగంలోకి దిగి క్లారిఫై ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆ తాజా న్యూస్ ఏంటో చూద్దాం.
ప్రభాస్ కమిట్ అయిన నయా మూవీస్ లో స్పిరిట్ కూడా ఒకటి. ఇందులో ప్రముఖ హీరోయిన్ త్రిష నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ గానో లేక మరో క్యారక్టర్లోనో తెలియదుగాని స్పిరిట్ లో ఆమె చేస్తుందనే వార్తలైతే వస్తున్నాయి. దీంతో చిత్ర బృందం రంగంలోకి దిగి ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది.అలాగే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నామని త్వరలోనే నటీనటుల వివరాలని కూడా వెల్లడి చేస్తామని చెప్పింది.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ లో ప్రభాస్ మొట్టమొదటిసారిగా పోలీసు ఆఫీసర్ క్యారక్టర్ లో కనిపించనున్నాడు. టి సిరీస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తుంది. త్రిష ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర లో నటిస్తుంది. ఆల్రెడీ షూటింగ్ లో కూడా పాల్గొంటుంది. ప్రభాస్, త్రిషల కాంబోలో గతంలో వర్షం మూవీ వచ్చి సంచలన విజయాన్ని సాధించిన విషయం అందరకి తెలిసిందే. ఇక ప్రభాస్ సలార్ విజయంతో మంచి ఫామ్ లో ఉన్నాడు.