నీకు కావాల్సింది ప్రేమ బీచ్ మాత్రమే
on Feb 23, 2024
సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్న నటి నీహారిక కొణిదెల మెగా డాటర్ అనే టాగ్ లైన్ ఎలాగు ఉండనే ఉంది కాబట్టి ఇంక పాపులారిటీ కి కూడా కొదవ ఉండదు. అడపాదడపా వార్తల్లో ఉండే నిహారిక లేటెస్ట్ గా మళ్ళీ వార్తల్లో నిలిచింది.
నీహారిక తన ఇనిస్టాగ్రామ్ స్టోరీ లో నీకు కావాల్సింది ప్రేమ బీచ్ మాత్రమే అనే క్యాప్షన్ ని ఉంచింది. ఇప్పుడు ఆ క్యాప్షన్ ని చూసిన వారందరు నీహారిక ఎవరి ప్రేమలో అయినా పడిపోయిందా అనే అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు. తన ప్రేమ గురించి ఆ విధంగా ఏమైనా హింట్ ఇస్తుందేమో అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.కానీ ఆమె సన్నిహితులు మాత్రం నీహారిక తన ఫ్యామిలీ మెంబెర్స్ గురించి స్పందిస్తు ఆ విధంగా పోస్ట్ చేసిందని అంటున్నారు.
ఆమె ప్రస్తుతం మలయాళంలో ఒక మూవీ చేస్తుంది.మద్రాస్కరన్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ మూవీలో షేన్ నిగమ్ సరసన జత కడుతుంది. 2020 లో చైతన్య జొన్నలగడ్డ ని పెళ్లి చేసుకున్న నీహారిక ఆ తర్వాత అతని నుంచి విడిపోయింది. ఇప్పుడు సినిమాల మీదనే తన ధ్యాసంతా ఉంచింది.
Also Read