హిందీలో మహేష్ బాబు స్థానం టాప్ 3..ఆధారాలతో నిజం మీ ముందుకు
on Feb 21, 2024
మడత పెట్టిన కుర్చీ సాక్షిగా మహేష్ బాబు నయా మూవీ గుంటూరు కారం కలెక్షన్స్ పరంగా సృష్టించిన రికార్డులు నేటికీ అందరు ముందు ఉన్నాయి.ప్రేక్షకులకి మరింత దగ్గర కావాలనే ఉద్దేశంతో ఇటీవలే ఓటిటి లో రిలీజ్ అయ్యింది.రిలీజ్ అవ్వడమే కాదు కళ్ళు చెదిరిపోయే ఒక నయా రికార్డుని క్రియేట్ చేసింది.
గుంటూరు కారం నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగు వెర్షన్ తో పాటు హిందీ డబ్బింగ్ లో కూడా విడుదల అయ్యింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలుగు వెర్షన్ ని మించి హిందీ డబ్బింగ్ వెర్షన్ ని ఎక్కువ మంది చూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ లేటెస్ట్ గా విడుదల చేసిన టాప్ 10 ఛార్ట్స్ లో హిందీ వెర్షన్ టాప్ 3 లో ఉంది.ఇప్పుడు ఈ న్యూస్ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో మహేష్ కి ఉన్న స్టామినాని తెలియచేస్తుంది. అలాగే తెలుగు వెర్షన్ టాప్ 4 లో ఉంది .సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలని చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారికా & హాసిని క్రియేషన్స్ నిర్మించిన గుంటూరు కారం గత నెల సంక్రాంతికి వచ్చి సందడి చేసింది.మహేష్ తో శ్రీలీల ,మీనాక్షి చౌదరి లు జత కట్టగా రమ్యకృష్ణ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు నేటికీ తెలుగు రాష్ట్రాలని ఒక ఊపు ఊపుతున్నాయి.మహేష్ ప్రస్తుతం రాజమౌళి తో చెయ్యబోయే మూవీకి సంబంధించిన పనుల్లో ఉన్నాడు.
Also Read