అప్పుడే ఓటీటీలోకి 'లాల్ సలామ్'..!
on Feb 13, 2024
సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్యపాత్ర పోషించిన తాజా చిత్రం 'లాల్ సలామ్'. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సూపర్ స్టార్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మతం కంటే మానవత్వం గొప్పదనే సందేశంతో రూపొందిన ఈ సినిమా.. ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ తో నెగటివ్ టాక్ తెచ్చుకుంది. రజినీకాంత్ వంటి బిగ్ స్టార్ ఉన్నప్పటికీ కనీస వసూళ్లను రాబట్టలేకపోతోంది. దీంతో త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది.
'లాల్ సలామ్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా.. మూవీ రిలీజ్ కి ముందు అగ్రిమెంట్ చేసుకున్నారట. అయితే సినిమాకి నెగటివ్ టాక్ రావడం, పది రోజులు కూడా థియేటర్లలో ఆడే పరిస్థితి లేకపోవడంతో.. ఇప్పుడు కొత్త అగ్రిమెంట్ రాసుకున్నారట. దీని ప్రకారం నాలుగు వారాలకే ఓటీటీలోకి రాబోతుందట. మార్చి 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
Also Read