యష్, అల్లు అర్జున్ లో ఆపేదెవరు!
on Feb 8, 2024
యష్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఎప్పటి నుంచో తమ తమ మాతృ భాషలో సినిమాలు చేసుకుంటు అగ్రహీరోలుగా కొనసాగుతు వస్తున్నారు. కానీ ఓవర్ నైట్ ఒకే ఒక్క సినిమాతో ఆ ఇద్దరు ఇండియా వ్యాప్తంగా పేరు సంపాదించారు. యష్ కేజిఎఫ్ తో అల్లు అర్జున్ పుష్ప తో ఆ ఘనత ని సాధించారు. తాజాగా ఆ ఇద్దరికీ సంబంధించి పోలిక ఉన్న న్యూస్ ఒకటి ఇరువురి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటుంది.
2018 లో యష్ హీరోగా వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 1 , 2021 లో వచ్చిన అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ పార్ట్ 1 లు ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో వచ్చి పాన్ ఇండియా ప్రేక్షకులని ఒక ఊపు ఊపాయి.అలాగే రికార్డు స్థాయి కలెక్షన్స్ ని కూడా సాధించాయి . అంతే కాకుండా అన్ని భాషల సినీ మేకర్స్ కి ఛాలెంజ్ కూడా విసిరాయి. ఆ తర్వాత 2022 లో కేజిఎఫ్ చాప్టర్ 2 వచ్చి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన పవర్ తగ్గలేదని నిరూపించింది. ఇప్పుడు 2024 లో పుష్ప ది రూల్ పార్ట్ 2 సునామీని సృష్టించడానికి సిద్ధం అవుతుంది.పైగా ఇంకో విషయం ఏంటంటే యష్, అల్లు అర్జున్ లు మరో సినిమా ఒప్పుకోకుండా వరుసగా కేజిఎఫ్, పుష్పలని చేసుకుంటు వచ్చారు.
అలాగే ఇంకో విషయం ఏంటంటే కేజిఎఫ్ చాప్టర్ 2 ఎండింగ్ లో చాప్టర్ 3 కూడా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పాడు. ఇప్పుడు కూడా అలాగే పుష్ప 2 తర్వాత పుష్ప 3 ది రోర్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇలా కేజిఎఫ్ కి పుష్ప కి పోలికలు వేసుకొని ఇరువురి అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు చాలా ఇంట్రెస్ట్ గా చర్చించుకుంటున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే యష్ ప్రస్తుతం కేజిఎఫ్ కాకుండా వేరే కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అంటే ఆ తర్వాత కేజిఎఫ్ 3 ఉంటుందేమో. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అంటే ఆ తర్వాత పార్ట్ 3 చేస్తాడేమో.ఇప్పుడు యష్ అల్లు అర్జున్ కి ఉన్న ఈ పోలికలని దృష్టిలో పెట్టుకొని వీళ్ళిద్దరిలో ఆపేదెవరు అని సినిమా మనుషులు మాట్లాడుకుంటున్నారు.
Also Read