కలెక్షన్ల మోత మోగిస్తున్న 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'
on Feb 4, 2024
గతేడాది 'రైటర్ పద్మభూషణ్'తో ఘన విజయాన్ని అందుకున్న సుహాస్.. ఈ ఏడాది 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'తో ప్రేక్షకులను పలకరించాడు. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ టాక్ కి తగ్గట్టుగానే మంచి వసూళ్లతో చాటుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కాయి.
మేకర్స్ తెలిపిన దాని ప్రకారం.. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.2.28 కోట్ల గ్రాస్ రాబట్టగా, రెండో రోజు రూ.2.88 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. దీంతో రెండో రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.5.16 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మూడో రోజు ఆదివారం కావడంతో మరో మూడు కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉంది. పైగా ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'కి కలిసొచ్చే అంశం.
'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించాడు. శివాని నాగరం హీరోయిన్ గా నటించగా..శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న కీ రోల్స్ చేశారు.