దిల్ రాజు ప్లాన్ ఛేంజ్.. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కాంబో మూవీ..!
on Feb 2, 2024
విక్టరీ వెంకటేష్ సెంటిమెంట్ సీన్స్ తో ఎంతలా ఏడిపించగలడో, కామెడీ చేసి అంతలా నవ్వించగలడు. ఆయన కెరీర్ లో ఘన విజయం సాధించిన కామెడీ ఎంటర్టైనర్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ ఆయన నుంచి కామెడీ చిత్రాలను ఆశించే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. మరోవైపు ఈ తరంలో కామెడీ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి మంచి పేరు తెచ్చుకున్నాడు. గత చిత్రం 'భగవంత్ కేసరి'తో రూట్ మార్చినప్పటికీ.. కామెడీ డైరెక్టర్ అనే ముద్ర రావిపూడిపై అలాగే ఉంది.
ఇద్దరు కామెడీలో దిట్ట కాబట్టే.. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే వీరి కలయికలో 'ఎఫ్-2', 'ఎఫ్-3' సినిమాలు వచ్చాయి. 'ఎఫ్-2' బ్లాక్ బస్టర్ కాగా, 'ఎఫ్-3' పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు వీరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందనుందట. అంతేకాదు, 2025 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
నిజానికి దిల్ రాజు నిర్మిస్తున్న 'శతమానం భవతి-2' వచ్చే సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు దాని స్థానంలో వెంకటేష్-రావిపూడి హ్యాట్రిక్ మూవీని రిలీజ్ చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు 'విశ్వంభర'తో 2025 సంక్రాంతిపై ఇప్పటికే చిరంజీవి కర్చీఫ్ వేశారు.
Also Read