యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ దగ్గరకి మెగా కోడలు లావణ్య త్రిపాఠి
on Jan 27, 2024
అందాలరాక్షసి మూవీతో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసిన నటి లావణ్య త్రిపాఠి.ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటనకి ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. కొన్ని రోజుల క్రితం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకొని తెలుగు వారి కోడలుగా కూడా మారింది. తాజాగా లావణ్య కి సంబంధించిన ఒక న్యూస్ క్రేజీ న్యూస్ గా మారింది
భారతదేశ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 30 న జాతీయ పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుతుంది. ఈ సందర్భంగా రేపు అంటే 28 న ఏపి లోని విశాఖ పట్నం లో పరిశుభ్రతకి సంబంధించిన కార్యక్రమం జరగనుంది. స్థానిక వైఏంసిఏ అంటే యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ ఏరియాలో జరుగుతున్న క్లీనింగ్ కార్యక్రమంలో లావణ్య పాల్గొనబోతుంది. అంతే కాకుండా తనే దగ్గరుండి క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకి చెందిన విద్యార్థులతో పాటు స్థానికులు ఎన్ జిఓ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి.
ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే తాజాగా లావణ్య మెయిన్ రోల్ లో మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇందులో పరిశుభ్రత పట్ల నిబద్దత కలిగిన యువతీ క్యారక్టర్ లో ఆమె నటించింది. ఇప్పుడు అదే తరహాలో రియల్ గా వైజాగ్ వైఏం సిఏ దగ్గర జరిగే క్లీనింగ్ కార్యక్రమంలో లావణ్య పాల్గొనడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్ సహకారంతో తెరకెక్కిన మిస్ పర్ఫెక్ట్ ఫిబ్రవరి 2 న డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read