కుర్చీ తాతని మడతపెట్టిన పోలీసులు..!
on Jan 25, 2024
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి అంటే కుర్చీ తాత అని చెప్పవచ్చు. "ఆ కుర్చీని మడతపెట్టి ..." అనే డైలాగ్ తో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపాడు. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమాలో 'కుర్చీ మడతపెట్టి' అనే సాంగ్ పెట్టారంటే ఆ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ డైలాగ్ తో కుర్చీ తాతగా ఎంతో ఫేమస్ అయిన కాలా పాషాను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
"ఆ కుర్చీని మడతపెట్టి.." డైలాగ్ తో పాపులర్ కావడంతో ఆ తాత వెంట యూట్యూబ్ ఛానల్స్ పరుగెత్తాయి. ఎన్నో ఇంటర్వ్యూలు చేశాయి. ఈ క్రమంలో ఆయన పలువురు సినీ రాజకీయ ప్రముఖులపై హాట్ కామెంట్స్ చేశాడు. కొన్నిసార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు హద్దు మీరినట్లుగా ఉన్నాయి. చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఎవరినీ వదలకుండా షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. అయితే తమపై దారుణ వ్యాఖ్యలు చేయడంతో పాటు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడంటూ రీసెంట్ గా కుర్చీ తాతపై వైజాగ్ సత్య, స్వాతి నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో "కుర్చీ తాతని మడతపెట్టిన పోలీసులు" అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Also Read