కేరళకి హీరో నితిన్.. పవన్ కళ్యాణ్ తమ్ముడు కానే కాదు
on Jan 24, 2024
నితిన్ నుంచి గత డిసెంబర్ లో వచ్చిన సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. ఆ మూవీ విజయం మీద నితిన్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ మూవీ నెగిటివ్ టాక్ ని తెచ్చుకొని పరాజయం అంచున నిలబడింది. తాజాగా నితిన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది. వి ఎన్ 2 గా అభివర్ణిస్తున్న ఈ నయా మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ కేరళలో ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం నితిన్ త్వరలోనే కేరళ బయలుదేరి వెళ్ళనున్నాడు.ప్రముఖ తారాగణమంతా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతుంది. ఇంతకు ముందు నితిన్ ,వెంకీ ల కాంబోలో వచ్చిన భీష్మ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ మూవీపై నితిన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి.
నితిన్ ఈ మూవీతో పాటు వకీల్ సాబ్ డైరెక్టర్ శ్రీ రామ్ వేణు దర్శకత్వంలో కూడా ఒక మూవీ చేస్తున్నాడు.ఆ మూవీకి పవన్ కళ్యాణ్ ఒకప్పటి హిట్ మూవీ తమ్ముడు సినిమా టైటిల్ ని పెట్టడం జరింగింది. ఆ సినిమా షూటింగ్ కూడా ఒక పక్కన జరుగుతుంది. ఇలా నితిన్ తన రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొంటు ఎలాగైనా ఈ సారి రెండు సినిమాల ద్వారా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. నితిన్ అభిమానులు కూడా ఆ రెండు సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు.
Also Read